AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎరక్కపోయి ఇరుక్కుపోయిన ఆంబోతులు.. మూగ జీవాలకు ప్రాణ భిక్ష పెట్టిన ట్రాఫిక్ పోలీసులు

మనుషుల మధ్య మానవత్వం మసకబారుతున్న ఈరోజుల్లో.. మాట్లాడలేని మూగజీవాల ప్రాణాల కోసం పరుగులెత్తాయి కొన్ని చేతులు..! విజయవాడలో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించాయి. డ్రైనేజీ కాలవలో చిక్కుకున్న రెండు !ఎద్దులను ట్రాఫిక్ పోలీసులు, విఎంసీ సిబ్బంది క్రేన్ సహాయంతో సురక్షితంగా బయటకు తీశారు. ఇప్పుడు విజయవాడ ట్రాఫిక్ పోలీసుల సమయస్పూర్తికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఎరక్కపోయి ఇరుక్కుపోయిన ఆంబోతులు.. మూగ జీవాలకు ప్రాణ భిక్ష పెట్టిన ట్రాఫిక్ పోలీసులు
Bulls In Drainage
M Sivakumar
| Edited By: |

Updated on: Feb 11, 2026 | 12:06 PM

Share

మనుషుల మధ్య మానవత్వం మసకబారుతున్న ఈరోజుల్లో.. మాట్లాడలేని మూగజీవాల ప్రాణాల కోసం పరుగులెత్తాయి కొన్ని చేతులు..! విజయవాడలో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించాయి. డ్రైనేజీ కాలవలో చిక్కుకున్న రెండు !ఎద్దులను ట్రాఫిక్ పోలీసులు, విఎంసీ సిబ్బంది క్రేన్ సహాయంతో సురక్షితంగా బయటకు తీశారు. ఇప్పుడు విజయవాడ ట్రాఫిక్ పోలీసుల సమయస్పూర్తికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మూగజీవాల ప్రాణాల కోసం ట్రాఫిక్ పోలీసులు, విఎంసీ సిబ్బంది, స్థానికులు కలిసి పరుగులెత్తారు. ఈ సంఘటన విజయవాడ బీఆర్టీఎస్ రోడ్ జంక్షన్ వద్ద చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న డ్రైనేజీ కాలువలో రెండు ఎద్దులు ప్రమాదవశాత్తు జారిపడ్డాయి. ఇరుకైన కాలవలో శరీరం నలిగిపోయి బయటకు రావడానికి అవి చేసిన పోరాటం చూసినా వారిని కలిచివేసింది. తల పైకెత్తి సహాయం కోసం చూసే ఆ కళ్ళల్లో భయం, అలసట, ప్రాణం కోసం అర్తనాదం చూసే వారందరికీ స్పష్టంగా కనిపించింది.

దీంతో సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు క్షణాలలో అక్కడికి చేరుకున్నారు. ట్రాఫిక్ డ్యూటీ మధ్యలోనే ముందు ప్రాణాలు కాపాడాలి అన్న ఒక్క ఆలోచనతో రెస్క్యూ చర్యలు ప్రారంభించారు. విఎంసీ సిబ్బందిని అప్రమత్తం చేసి క్రేన్ ను తీసుకువచ్చారు. డ్రైనేజీలో ఇరుక్కుపోయిన ఎద్దులకు బెల్టులు కట్టడం కూడా సవాలుగా మారింది. భయంతో అవి కదలాడుతుండగా సిబ్బంది వాటిని నిమురుతూ ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ క్రేన్ సహాయంతో నెమ్మదిగా పైకి లాగారు. చుట్టూ చేరిన స్థానికులు కూడా సహాయం చేశారు. ఆ క్షణాల్లో అక్కడ ఉన్న వారందరూ ఒక కుటుంబంలో మారిపోయారు.

కొన్ని ఉత్కంఠ నిమిషాల తర్వాత రెండు ఎద్దులను సురక్షితంగా బయటకు తీశారు. నేలమీద నిలబడగానే అవి తేరుకుని నడవడం చూసి అందరి ముఖాల్లో ఆనందం వెల్లువిరిసింది. డ్యూటీ పరిమితులని దాటి మూగజీవాల ప్రాణాలను తమ ప్రాణంలా భావించి కాపాడిన ట్రాఫిక్ పోలీసులు విఎంసీ సిబ్బంది కి జంతు ప్రేమికులు అభినందనలు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఏసీ బీభత్సంగా వాడినా కరెంట్ బిల్లు తక్కువ రావాలా..
ఏసీ బీభత్సంగా వాడినా కరెంట్ బిల్లు తక్కువ రావాలా..
అబ్బా ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఇకపై అక్కడ నో పార్కింగ్‌ ఫీజ్
అబ్బా ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఇకపై అక్కడ నో పార్కింగ్‌ ఫీజ్
Team India: ఫైనల్‌కు ముందు భారత్‌కు తలనొప్పిగా మారిన ఆ ముగ్గురు?
Team India: ఫైనల్‌కు ముందు భారత్‌కు తలనొప్పిగా మారిన ఆ ముగ్గురు?
ఊహించని మలుపులు, దెబ్బకు బాక్సాఫీస్ షేక్..
ఊహించని మలుపులు, దెబ్బకు బాక్సాఫీస్ షేక్..
ప్రపంచమంతా పెట్రోల్ మంటలు.. భారత్‌ మాత్రం ధీమాగా.. మోదీ సర్కార్..
ప్రపంచమంతా పెట్రోల్ మంటలు.. భారత్‌ మాత్రం ధీమాగా.. మోదీ సర్కార్..
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?
కొండముచ్చుకు గుండెపోటు.. నిమిషాల్లోనే అద్భుతం..
కొండముచ్చుకు గుండెపోటు.. నిమిషాల్లోనే అద్భుతం..
వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, సిరీస్‌లివే
వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, సిరీస్‌లివే
ఓరీ దేవుడో.. వార్‌ ఎఫెక్ట్‌తో మండిపోతున్న ఆయిల్ ధరలు..2023 తర్వాత
ఓరీ దేవుడో.. వార్‌ ఎఫెక్ట్‌తో మండిపోతున్న ఆయిల్ ధరలు..2023 తర్వాత
ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే
ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే