AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ఫైనల్‌కు ముందు భారత్‌కు తలనొప్పిగా మారిన ఆ ముగ్గురు.. జట్టు నుంచి తప్పించకుంటే ఓటమి పక్కా..?

India Playing 11 Changes for Final: భారత జట్టు ఫైనల్ కోసం కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఏకంగా ప్లేయింగ్ 11 నుంచి ముగ్గురిని తీసేందుకు గంభీర్, సూర్య ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బలమైన జట్టుతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది.

Team India: ఫైనల్‌కు ముందు భారత్‌కు తలనొప్పిగా మారిన ఆ ముగ్గురు.. జట్టు నుంచి తప్పించకుంటే ఓటమి పక్కా..?
Ind Vs Nz Playing 11
Venkata Chari
|

Updated on: Mar 07, 2026 | 10:21 AM

Share

T20 World Cup 2026: టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్ పోరులో ఇంగ్లాండ్‌ను 7 పరుగుల తేడాతో ఓడించి భారత్ ఘనవిజయం సాధించింది. భారత జట్టు ఓవరాల్‌గా నాలుగోసారి, వరుసగా రెండోసారి ఫైనల్ టికెట్ దక్కించుకుంది. అయితే, జట్టు విజయపథంలో ఉన్నప్పటికీ అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్‌ల పేలవ ఫామ్ ఇప్పుడు టీమ్ మేనేజ్‌మెంట్‌కు పెద్ద సమస్యగా మారింది.

1. వరుణ్ చక్రవర్తి: ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో వరుణ్ చక్రవర్తి తన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు. అతనికి దక్కింది కేవలం ఒకే వికెట్. అంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌లోనూ 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీశాడు. సూపర్-8లో సౌతాఫ్రికాపై కూడా 47 పరుగులు ఇచ్చి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. కీలకమైన నాకౌట్ మ్యాచ్‌ల్లో వరుణ్ ప్రభావం చూపలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఫైనల్‌లో అతని స్థానంలో అనుభవజ్ఞుడైన కుల్దీప్ యాదవ్ మెరుగైన ప్రత్యామ్నాయం కావచ్చు.

2. అభిషేక్ శర్మ: అభిషేక్ శర్మకు ఈ టీ20 వరల్డ్ కప్ ఒక పీడకలలా మారింది. ఇప్పటివరకు ఆడిన 7 ఇన్నింగ్స్‌ల్లో అతను కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. గ్రూప్ స్టేజ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ అతను కనీసం ఖాతా తెరవకుండానే (డకౌట్) వెనుదిరగడం గమనార్హం. జింబాబ్వేపై 55 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించినా, ఆ తర్వాత వెస్టిండీస్, సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై మళ్ళీ విఫలమయ్యాడు. ఫైనల్‌లో అభిషేక్ స్థానంలో ఫినిషర్ రింకూ సింగ్ను జట్టులోకి తీసుకుంటే బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతం అవుతుంది.

3. అర్ష్‌దీప్ సింగ్: అర్ష్‌దీప్ సింగ్ ఇటీవలి ఫామ్ కూడా భారత జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. ఇంగ్లాండ్‌పై సెమీఫైనల్‌లో అతను 4 ఓవర్లలో 51 పరుగులు ఇచ్చాడు. వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లోనూ వికెట్ తీయకుండానే 43 పరుగులు సమర్పించుకున్నాడు. టీమ్ ఇండియా ప్రస్తుతం ఐదుగురు ప్రధాన బౌలర్లతోనే ఆడుతోంది. కాబట్టి, ప్రధాన పేసర్ ఇలా పరుగులు ఇస్తుంటే జట్టు సమీకరణాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఫైనల్‌లో అర్ష్‌దీప్ స్థానంలో మహ్మద్ సిరాజ్ వంటి అనుభవజ్ఞుడిని తీసుకోవడం శ్రేయస్కరం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
Team India: ఫైనల్‌కు ముందు భారత్‌కు తలనొప్పిగా మారిన ఆ ముగ్గురు?
Team India: ఫైనల్‌కు ముందు భారత్‌కు తలనొప్పిగా మారిన ఆ ముగ్గురు?
ఊహించని మలుపులు, దెబ్బకు బాక్సాఫీస్ షేక్..
ఊహించని మలుపులు, దెబ్బకు బాక్సాఫీస్ షేక్..
ప్రపంచమంతా పెట్రోల్ మంటలు.. భారత్‌ మాత్రం ధీమాగా.. మోదీ సర్కార్..
ప్రపంచమంతా పెట్రోల్ మంటలు.. భారత్‌ మాత్రం ధీమాగా.. మోదీ సర్కార్..
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?
కొండముచ్చుకు గుండెపోటు.. నిమిషాల్లోనే అద్భుతం..
కొండముచ్చుకు గుండెపోటు.. నిమిషాల్లోనే అద్భుతం..
వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, సిరీస్‌లివే
వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, సిరీస్‌లివే
ఓరీ దేవుడో.. వార్‌ ఎఫెక్ట్‌తో మండిపోతున్న ఆయిల్ ధరలు..2023 తర్వాత
ఓరీ దేవుడో.. వార్‌ ఎఫెక్ట్‌తో మండిపోతున్న ఆయిల్ ధరలు..2023 తర్వాత
ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే
ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే
రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు అమెరికా అనుమతి.. కారణం ఇదేనట..
రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు అమెరికా అనుమతి.. కారణం ఇదేనట..
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?