AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో…వరుసగా 14 రోజులు అవకాడో తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ డాక్టర్ విశ్లేషణ!

నేటి ఆధునిక జీవనశైలిలో సరైన పోషకాహారం తీసుకోవడం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అత్యంత అవసరం. ఈ క్రమంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అవకాడో పండుకు ఇటీవల ఆదరణ బాగా పెరిగింది. వరుసగా 14 రోజుల పాటు రోజూ ఒక అవకాడో తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయాల్లో శిక్షణ పొందిన నిపుణులు స్పష్టంగా వివరించారు. 14 రోజుల్లో శరీరంలో కనిపించే ప్రధాన మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Jyothi Gadda
|

Updated on: Jul 29, 2026 | 2:10 PM

Share
చెడు కొలెస్ట్రాల్ తగ్గుదల: అవకాడోలలో ఒమేగా-3, మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. వరుసగా వారాల పాటు వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గి, మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరుగుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

1 / 5
జీర్ణక్రియ మెరుగుపడటం: ఒక మీడియం సైజ్ అవకాడోలో దాదాపు 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది కడుపులోని మంచి బ్యాక్టీరియాను పెంచి, మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

2 / 5
బరువు నియంత్రణ, షుగర్ లెవెల్స్: అవకాడో తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సేపు ఉంటుంది. దీనివల్ల అనవసరమైన కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది. అంతేకాకుండా, ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి రక్తంలో చక్కెర స్థాయిలు సడన్ గా పెరగకుండా నియంత్రిస్తుంది.

3 / 5
మెరిసే చర్మం, కంటి చూపు: దీనిలో ఉండే విటమిన్ సి, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మంచి మెరుపును ఇస్తాయి. అలాగే లుటీన్, జియాంటిన్ అనే పోషకాలు వయస్సు రీత్యా వచ్చే కంటి సమస్యల నుండి రక్షణనిస్తాయి. అవకాడోను ఉదయం అల్పాహారంలో టోస్ట్ పై లేదా స్మూతీ రూపంలో తీసుకోవచ్చు. అలాగే సలాడ్లలో ముక్కలుగా కోసి చేర్చుకోవడం వల్ల పూర్తి పోషకాలు లభిస్తాయి.

4 / 5
అవకాడో కేవలం ఒక ట్రెండీ ఫుడ్ మాత్రమే కాదు, శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందించే ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్. వరుసగా 14 రోజులు మీ ఆహారంలో దీన్ని భాగం చేసుకోవడం ద్వారా గుండె, జీర్ణక్రియ, చర్మ ఆరోగ్యంలో స్పష్టమైన సానుకూల మార్పులను గమనించవచ్చు.

5 / 5
Follow Us