AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీశైలం భ్రమరాంబికాదేవికి శాకాంబరీ అలంకారం.. 3 వేల కేజీల కూరగాయలు, వేలాది ఫలాలతో దివ్య శోభ!

ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం శ్రీభ్రమరాంబికాదేవికి అత్యంత వైభవంగా శాకాంబరీ ఉత్సవం నిర్వహించారు. సుమారు 3 వేల కేజీల కూరగాయలు, 100 గుమ్మడికాయలు, 2 వేల నిమ్మకాయలు, ఆకు కూరలు, పలు రకాల ఫలాలతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవం వల్ల సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని భక్తుల విశ్వాసం.

J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Jul 29, 2026 | 12:55 PM

Share
నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శక్తిపీఠం శ్రీభ్రమరాంబికాదేవి అమ్మవారికి ఆషాడ పౌర్ణమి సందర్భంగా ఆలయ ఈవో, చైర్మన్, సభ్యులు, అర్చక, వేద పండితులు శాకాంబరీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు.

1 / 5
శాకాంబరీ ఉత్సవంలో భాగంగా శ్రీభ్రమరాంబికాదేవి అమ్మవారి మూలమూర్తిని 3 వేల కేజీల వివిధ రకాల కూరగాయలు,100 గుమ్మడికాయలు, 2 వేల నిమ్మకాయలు, ఆకు కూరలు, పలు రకాల ఫలాలతో విశేషంగా అలంకరించారు.

2 / 5
అలాగే దేవాలయ ప్రాంగణాన్ని వేల కేజీల పలు రకాల ఆకు కూరలు,  కూరగాయలు, వివిధ ఫలాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి,  కర్పూర హారతులిచ్చారు.

3 / 5
అలానే ఆలయంలోని రాజరాజేశ్వరిదేవికి, ఆలయం ఎదురుగా ఉన్న గ్రామదేవత అంకాలమ్మకు ప్రత్యేక పూజలు, శాకాలంకరణ చేశారు.  అమ్మవారిని శాకాలతో అర్చించడం వల్ల సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయని ప్రతీతి.

4 / 5
ప్రతి ఆషాడమాసం పౌర్ణమినాడు లోక  కళ్యాణార్ధం భ్రమరాంబికాదేవి అమ్మవారికి ఈ శాకాంబరీ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శాకాంబరీ అలంకారంలో ఉన్న భ్రమరాంబికాదేవి అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు.

5 / 5
Follow Us