AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రీపెయిడ్ యూజర్లకు శుభవార్త.. 30 రోజుల ప్లాన్ తప్పనిసరి

ప్రీపెయిడ్ యూజర్లకు శుభవార్త.. 30 రోజుల ప్లాన్ తప్పనిసరి

Phani CH
|

Updated on: Sep 29, 2026 | 10:19 PM

Share

దేశవ్యాప్తంగా మొబైల్‌ వినియోగదారులకు ట్రాయ్‌ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. 30 రోజుల వ్యాలిడిటీ ఉన్న రీఛార్జ్‌ కాల వ్యవధులకు అనుగుణంగా వాయిస్‌, ఎస్‌ఎంఎస్‌ మాత్రమే ఉండే ప్రత్యేక ప్లాన్‌లు అందించాలని టెలికాం సంస్థలను ఆదేశించింది. ప్రతి నెలా ఒకే తేదీన రెన్యూవల్‌ అయ్యే ప్లాన్‌లతో పాటు మరింత ఎక్కువ వ్యాలిడిటీ ఉన్న కాలాలకు కూడా Voice-SMS-only ఎంపికలు కల్పించాలి. డేటా అవసరం లేని వినియోగదారులకు ఇది అదనపు రీఛార్జ్‌ ఎంపికలను అందించనుంది.

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. టెలికాం కంపెనీలు ఇకపై తప్పనిసరిగా పూర్తి 30 రోజుల వ్యాలిడిటీతో కూడిన రీఛార్జ్ ప్లాన్‌లను అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, డేటా అవసరం లేని వారి కోసం కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎమ్‌ఎస్‌లతో మాత్రమే ఉండే ప్రత్యేక ప్లాన్‌లను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేస్తూ “టెలికాం కన్స్యూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్, 2026″ను విడుదల చేసింది. ఇప్పటివరకు టెలికాం సంస్థలు 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌లనే ఎక్కువగా విక్రయించడం వల్ల వినియోగదారులు ఏడాదికి 13 సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చేది. తాజా నిబంధనలతో ఇకపై 30 రోజుల ప్లాన్ తప్పనిసరి కానుంది. దీనివల్ల ఏడాదికి 12 రీఛార్జ్‌లు చేసుకుంటే సరిపోతుంది. మరింత సౌలభ్యం కోసం ప్రతి నెలా ఒకే తేదీన రెన్యూవల్ అయ్యే ప్రత్యేక ప్లాన్‌ను కూడా తేవాలని ట్రాయ్ ఆదేశించింది. ఈ అంశంపై రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంటులో గళమెత్తడంతో ట్రాయ్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా తక్కువ ఆదాయ వర్గాల వారు లేదా కేవలం వాయిస్ కాల్స్ వాడేవారు డేటా ప్లాన్లతో ఆర్థికంగా నష్టపోతున్నారని గు గుర్తించిన ట్రాయ్, వినియోగదారులకు వారి అవసరాలు, ఆర్థిక స్తోమతకు అనుగుణంగా రీఛార్జ్ ఎంచుకునే స్వేచ్ఛను కల్పించడమే ఈ కొత్త నిబంధనల లక్ష్యమని వెల్లడించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సినిమా రేంజ్ ఛేజింగ్.. కారుపై వేలాడుతూ 40 కి.మీ వెళ్లిన కానిస్టేబుల్

ఉదయాన్నే షాపు తెరుద్దామని వచ్చిన యజమాని.. అక్కడ సీన్‌ చూసి భయంతో పరుగు

బుల్లెట్‌ ట్రైన్‌లో టీమ్‌ ఇండియా.. ఆటగాళ్ల రియాక్షన్‌ చూస్తే

PM-KISAN: రైతులకు దసరా ధమాకా.. ఆ రోజే అకౌంట్లలోకి పీఎం కిసాన్ డబ్బులు

Anant Ambani: ఆపదలో ఉన్న అన్నదాతకు అనంత్ అంబానీ సాయం

Follow Us