కాకినాడ జిల్లా, చిన్నపొట్టి వెంకటాయపాలెంలో ఆటో డ్రైవర్ వడ్రెవు బాలకృష్ణ తన ఇంటిపై వందలాది రామచిలుకలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. తన స్వల్ప సంపాదన నుంచే రోజుకు 5 కేజీల ధాన్యం, పండ్లతో వాటికి ఆహారం అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. పక్షిప్రేమికుల సహాయం కోరుతూ ఈయన ఆదర్శంగా నిలుస్తున్నారు.