AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూట్యూబర్ కొంపముంచిన రీల్స్‌.. ఏం జరిగిందో మీరే చూడండి!

యూట్యూబర్ కొంపముంచిన రీల్స్‌.. ఏం జరిగిందో మీరే చూడండి!

Phani CH
|

Updated on: Sep 29, 2026 | 9:47 PM

Share

తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో సోషల్‌ మీడియా రీల్స్‌ చేసే ఓ మహిళ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లోని బంగారం, నగదు, విలువైన వస్తువులను రీల్స్‌లో ప్రదర్శించినట్లు చెబుతున్న మధుమిత ఇంట్లోకి దొంగలు చొరబడి 118 సవర్ల బంగారం, రూ.50 వేల నగదు, డైమండ్‌ నెక్లెస్‌ సెట్లు తదితరాలను ఎత్తుకెళ్లారు. కుటుంబం బయటకు వెళ్లిన సమయాన్ని గమనించిన దుండగులు వెనుక తలుపు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు.

కొంతమంది ఉంటారు.. కోట్ల రూపాయల సంపద ఉన్నా.. ఏదీ చూపించుకోరు. సాధారణ జీవితాన్ని గడుపుతుంటారు. ఇంకొందరుంటారు, ఇదిగో.. ఇలాంటి వారు. ఉన్న కొద్దిపాటి సొత్తును ఆన్‌లైన్లో పెట్టి.. జనాల ముందు షో చేయాలని చూస్తుంటారు. కాని.. ఈ మహిళ చేసిన అతికి.. దొంగలు సూపరన్‌ ట్విస్ట్‌ ఇచ్చారు. తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్‌లో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా వైరల్‌ అవుతోంది. సోషల్‌ మీడియాలో సోకాల్డ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉన్న మధుమితకు రీల్స్‌ పిచ్చి. యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేసి ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటుంది. నాగర్‌కోయిల్ సమీపంలోని తమ్మత్తుకోణం VIP Gardenలో నివాసముండే మధుమిత, వినోద్‌కుమార్ దంపతులకు ఓ కూతురు కూడా ఉంది. ఇక పొద్దున లేస్తే వీరికి ఒకటే పని.. ఇంట్లో ఉన్న డబ్బులు బంగారం బయటకు తీయాలి.. బెడ్డు మీదనో.. సోఫా మీద పోసి.. వాటితో రీల్స్‌ చేయాలి. ఇలా చేస్తే ఫాలోవర్లు పెరుగుతారన్న ప్లాన్‌ వేశారు. రోజూ బంగారం దిగేసుకుని.. కట్టలు కట్టల డబ్బులతో రీల్స్‌ చేసేది మధుమిత. ఆమె భర్త కూడా వంతపాడేవాడు. ఇలా వందల కొద్దీ రీల్స్‌తో వ్యూస్‌ పెంచుకోవాలనుకున్నా.. అనుకున్నంత ఫాలోవర్లు మాత్రం రాలేదు. అయితే.. జనాలు ఏమాత్రం చూశారో తెలియదుగాని.. ఈ వీడియోలు దొంగలు మాత్రం బాగా చూసారు. రంగంలోకి దిగారు.. నాగర్‌కోయిల్‌లోని వాళ్ల ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించారు. మధుమిత ఫ్యామిలీ ఎప్పుడు ఇంట్లో ఉంటారు? ఎప్పుడు బయటకు వెళ్తారనేది చూసుకున్నారు. ఇంట్లోకి ఎలా వెళ్లాలి అనేది కూడా స్కెచ్‌ వేసుకున్నారు. సెప్టెంబర్ 24 సాయంత్రం మధుమిత కుటుంబం బట్టల షాపింగ్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. రాత్రి తిరిగి వచ్చేసరికి… షాక్‌. మధుమిత ఇంట్లో బంగారం, నగలు, డబ్బు మాయం. దొంగలు వెనుక వైపు నుంచి ఇంట్లోకి ప్రవేశించారు. వెనుక తలుపు తాళాన్ని కటింగ్‌ మెషీన్‌తో కట్ చేసి లోపలికి వెళ్లి, బెడ్‌రూమ్‌లోని బీరువాను పగులగొట్టి మొత్తం దోచేశారు. దొంగలు ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే.. డైరెక్టుగా బీరువా దగ్గరకు వెళ్లి పగలగొట్టేశారు. అందులో ఉన్న 118 సవర్ల బంగారం.. అంటే దాదాపు కోటి రూపాయల విలువైన నగలను దోచుకున్నారు. అంతేకాదు.. అందులో ఉన్న 50వేల రూపాయల నగదు, డైమండ్‌ నెక్లెస్‌ సెట్లు, ఇతర విలువైన వస్తువులను చక్కగా ఎత్తుకెళ్లిపోయారు. రీల్స్‌లో ఆస్తులు చూపించడం.. వీడియోల్లో బంగారం ప్రదర్శించడం.. ఎక్కడికి వెళ్తున్నారో సోషల్ మీడియాలో చెప్పడం.. చివరికి అదే సమాచారం దొంగలకు ఉపయోగపడినట్లుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. చోరీకి ముందు మధుమిత సోషల్ మీడియా పోస్టుల్లో బంగారం, నగదు మాత్రమే కాదు.. కుటుంబం ఎక్కడికి వెళ్తోంది, ఎప్పుడు బయట ఉంటుందనే వివరాలు కూడా పంచుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి మధుమిత ఫ్యామిలీ ఉండే VIP Garden ఒక గేటెడ్ రెసిడెన్షియల్ ఏరియా. అక్కడ CCTV కెమెరాలు, ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది. అలాంటి ప్రదేశంలోనే దొంగతనం జరిగిందంటే పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. 6 బృందాలతో గాలింపుచర్యలు చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అద్దంకిలో అద్భుతం.. బంగారు కాంతులు వెదజల్లిన శివలింగం!

అమరావతిలో అద్భుత నిర్మాణాలు.. ఐకానిక్‌ టవర్ల వెనుక ఇంజినీరింగ్‌ అద్భుతాలు

Chedi Gang: హైదరాబాద్‌పై మళ్లీ చెడ్డీ గ్యాంగ్ పంజా

దూసుకొస్తున్న మరో వాయుగుండం దడ పుట్టిస్తున్న ఉపరితల ఆవర్తనం.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

ఏఐకి కూడా నొప్పా..! నొప్పి భరించలేక యూజర్లపై ఏఐ దాడి.. అధ్యయనంలో సంచలన విషయాలు!

Follow Us