AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అద్దంకిలో అద్భుతం.. బంగారు కాంతులు వెదజల్లిన శివలింగం!

అద్దంకిలో అద్భుతం.. బంగారు కాంతులు వెదజల్లిన శివలింగం!

Phani CH
|

Updated on: Sep 29, 2026 | 9:45 PM

Share

ప్రకాశం జిల్లా అద్దంకిలోని ప్రసిద్ధ వెయ్యి స్తంభాల గుడిలో అరుదైన సూర్యకిరణ స్పర్శ దర్శనం భక్తులను ఆకట్టుకుంది. ప్రాతఃకాలంలో ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించిన లేలేత సూర్యకిరణాలు నేరుగా శివలింగంపై పడి స్వామివారిని బంగారు కాంతులతో ప్రకాశింపజేశాయి. దక్షిణాయనంలో వరుసగా మూడు రోజుల పాటు ఈ కిరణ స్పర్శ దర్శనం జరుగుతుందని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు.

అది శతాబ్దాల నాటి ప్రాచీన శిల్పకళా వైభవమా? లేక సాక్షాత్తూ ఆ పరమశివుడి దివ్య మహిమా? ఏది ఏమైనా, ప్రకాశం జిల్లా అద్దంకిలోని ప్రసిద్ధ వెయ్యి స్తంభాల గుడిగా పేరుగాంచిన శ్రీ గంగా వింధ్యావాసిని సమేత నాగేశ్వరస్వామి ఆలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. గర్భగుడిలోని చీకట్లను చీల్చుకుంటూ వచ్చిన లేలేత సూర్యకిరణాలు నేరుగా శివలింగంపై పడ్డాయి. అభిషేకం పూర్తయ్యే సమయానికి సూర్యకిరణాలు స్వామివారిని తాకడంతో ఆ శివలింగం దివ్యమైన బంగారు కాంతులతో ప్రకాశించింది. ప్రాతఃకాలంలో సాక్షాత్తూ ఆ ఆదిత్యుడే మొదటి పూజారిగా మారి పరమేశ్వరుడిని అర్చించినట్లున్న ఈ అరుదైన దృశ్యం భక్తులకు దివ్య ఆధ్యాత్మిక అనుభూతిని అందించింది. ఈ అద్భుతం ఏడాదికి రెండు సార్లు మాత్రమే జరుగుతుంది. ఉత్తరాయణంలో సింగరకొండ తిరునాళ్ల తర్వాత, అలాగే దక్షిణాయనంలో వినాయక చవితి ముగిసిన కొద్ది రోజులకే ఈ కిరణ స్పర్శ ఆవిష్కృతమవుతుంది. దక్షిణాయన కాలంలో వరుసగా మూడు రోజుల పాటు సూర్యభగవానుడు స్వామివారిని దర్శించుకుంటారు. అందులో భాగంగానే ఆదివారం లభించిన తొలి స్పర్శ దర్శనం భక్తులను మైమరిపించింది. సోమ, మంగళవారం కూడా ఈ దివ్య దృశ్యం పునరావృతం కానుంది. ప్రాచీన వాస్తు నైపుణ్యానికి, దైవ మహిమకు నిదర్శనంగా నిలిచిన ఈ సూర్య స్పర్శ దర్శనం కోసం ఆలయానికి భక్తులు విశేషంగా తరలివస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమరావతిలో అద్భుత నిర్మాణాలు.. ఐకానిక్‌ టవర్ల వెనుక ఇంజినీరింగ్‌ అద్భుతాలు

Chedi Gang: హైదరాబాద్‌పై మళ్లీ చెడ్డీ గ్యాంగ్ పంజా

దూసుకొస్తున్న మరో వాయుగుండం దడ పుట్టిస్తున్న ఉపరితల ఆవర్తనం.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

ఏఐకి కూడా నొప్పా..! నొప్పి భరించలేక యూజర్లపై ఏఐ దాడి.. అధ్యయనంలో సంచలన విషయాలు!

హెయిర్‌కట్ తర్వాత ఆ మసాజ్ చేయిస్తున్నారా? ప్రాణాలకే ప్రమాదం!

Follow Us