ఢిల్లీ సే రెస్టారెంట్, ఖల్సా సోదరుల నిబద్ధతకు నిదర్శనం. ఒకానొక దశలో 18 లక్షల అప్పుల్లో కూరుకుపోయిన ఈ చోలే భటూరే రెస్టారెంట్, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల ఒక్క పోస్ట్ తో అదృష్టం తలుపు తట్టింది. కేవలం కొన్ని గంటల్లో వేల మంది సందర్శకులతో నిండి, నెలకు రెండు కోట్ల టర్నోవర్ తో నాలుగు బ్రాంచీలకు విస్తరించింది.