AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంచి ఆరోగ్యానికి రెండు స్పూన్లు చాలు.. కొవ్వును కరిగించి.. బరువును ఇట్టే తగ్గిస్తాయ్..

రోజుకు రెండు టేబుల్‌స్పూన్ల చియా సీడ్స్‌ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల పీచు, ప్రోటీన్, ఒమేగా-3 వంటి పోషకాలు అందుతాయి. ఇవి కడుపు నిండిన భావన, జీర్ణక్రియకు తోడ్పడవచ్చు. అయితే చియా సీడ్స్‌ ఒక్కటే కొవ్వును కరిగించవు. సమతుల్య ఆహారం, వ్యాయామంతో కలిపి తీసుకోవడం ముఖ్యం.

మంచి ఆరోగ్యానికి రెండు స్పూన్లు చాలు.. కొవ్వును కరిగించి.. బరువును ఇట్టే తగ్గిస్తాయ్..
Chia Seeds Benefits
Shaik Madar Saheb
|

Updated on: Sep 30, 2026 | 9:10 AM

Share

చియా సీడ్స్.. సూపర్‌ఫుడ్.. బరువు తగ్గడానికి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అద్భుతమైన చీయా సీడ్స్ పోషకాహారంగా పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఈ చిన్న విత్తనాలలో శరీరానికి అవసరమైన స్థూల (మ్యాక్రో), సూక్ష్మ (మైక్రో) పోషకాలు సమృద్ధిగా ఉన్నాయని పేర్కొంటున్నారు. సుమారు 30 గ్రాముల (రెండు టేబుల్ స్పూన్ల) చియా సీడ్స్‌లో 150 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది. అంతేకాకుండా, ఇందులో 4.5 గ్రాముల ప్రోటీన్, 8 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు, 5 గ్రాముల ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, 10 గ్రాముల ఫైబర్ ఉంటాయి. ఈ పోషకాలు చియా సీడ్స్‌ను ఒక అద్భుతమైన ఆహారంగా మారుస్తాయి.

ప్రస్తుతం చాలా మంది బాధపడుతున్న అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, అధిక రక్త చక్కెర స్థాయిలు, అధిక శరీర కొవ్వు వంటి సమస్యలకు ఇది మంచి పరిష్కారం అని డైటీషియన్లు చెబుతున్నారు. ఇందులో ఉండే పొటాషియం గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అందుకే రెగ్యులర్ గా తీసుకోవాలని సూచిస్తున్నారు.

చియా సీడ్స్ తీసుకోవలసిన విధానం..

చియా సీడ్స్‌ను నేరుగా కాకుండా, ఒకటి లేదా రెండు గంటల పాటు నీటిలో నానబెట్టడం మంచిది. నానబెట్టినప్పుడు, అవి నీటిని గ్రహించి ఉబ్బుతాయి, జెల్ లాంటి పదార్ధంగా మారతాయి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ నానబెట్టిన చియా సీడ్స్‌ను పెరుగుతో కలిపి తీసుకోవాలని సలహా. ఇది శరీరంలో కొవ్వును కరిగించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మెటబాలిజంకు మద్దతు ఇవ్వడానికి, శక్తి స్థాయిలను పెంచడానికి సహాయపడుతుందని ఆమె తెలిపారు.

బరువు తగ్గడంలో చియా సీడ్స్ పాత్ర..

చియా సీడ్స్‌లో అధిక మొత్తంలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగించి, ఎక్కువసేపు ఆకలి లేకుండా చేస్తుంది. తద్వారా ఆహార వినియోగాన్ని తగ్గిస్తుంది. దీనిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో మంటను తగ్గించి, గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. మెదడు, గుండె, రక్తనాళాల ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. చియా సీడ్స్‌లోని ప్రోటీన్ కండరాలు, రకరకాల అవయవాల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. జింక్, సెలీనియం, మాంగనీస్, మెగ్నీషియం వంటి ట్రేస్ ఎలిమెంట్స్ శరీర జీవక్రియలకు (మెటబాలిక్ యాక్టివిటీస్) ఎంతో సహాయపడతాయి.

సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం..

అయితే, కేవలం చియా సీడ్స్ తీసుకోవడం వల్ల మాత్రమే గణనీయమైన బరువు తగ్గడం అనేది ఒక అపోహ మాత్రమే.. చియా సీడ్స్‌ను మన ఆహారంలో చేర్చినప్పుడు, వాటిని సరియైన మోతాదులో ఆహారం (పోర్షన్ కంట్రోల్), ఆరోగ్యకరమైన ప్రోటీన్లు, కొవ్వులు, పీచు పదార్థాలతో కూడిన తక్కువ క్యాలరీల ఆహారంతో కలిపి తీసుకోవాలి. అనారోగ్యకరమైన ఆహారాన్ని, అధిక కొవ్వు ఉన్న ఆహారాన్ని కొనసాగిస్తూ కేవలం చియా సీడ్స్ తీసుకోవడం వల్ల ఆశించిన ఫలితాలు లభించవు. సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామంతో కలిపి చియా సీడ్స్ తీసుకోవడం ద్వారా మాత్రమే కొవ్వును తగ్గించి, ఆరోగ్యకరమైన బరువును సాధించవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us