AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అయిల్ ట్రక్కు బోల్తా.. రోడ్డంతా నూనె.. డబ్బాలు, వాహనాలతో ఎగబడిన జనం!

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ ఆయిల్ ట్రక్ బోల్తా పడటంతో రోడ్డంతా నూనె చిందింది. దీన్ని సేకరించడానికి స్థానికులు డబ్బాలతో ఎగబడ్డారు. ఉచితంగా నూనె దొరుకుతుందనే ఆశతో వందల సంఖ్యలో ప్రజలు ప్రమాదకరంగా ప్రవర్తించారు. ఇది ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించడమే కాకుండా, మరింత ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. అధికారుల సత్వర స్పందన లోపంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Watch: అయిల్ ట్రక్కు బోల్తా.. రోడ్డంతా నూనె.. డబ్బాలు, వాహనాలతో ఎగబడిన జనం!
Oil Truck Overturns
Balaraju Goud
|

Updated on: Sep 30, 2026 | 9:07 AM

Share

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని వీఐపీ చౌరస్తాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నూనెను తరలిస్తున్న ఓ ట్రక్కు అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. దీంతో ట్రక్కులో ఉన్న నూనె భారీగా రోడ్డుపైకి లీకైంది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.

రోడ్డుపై నూనె కనిపించడంతో కొందరు దానిని సేకరించేందుకు ఎగబడ్డారు. తమ వెంట తెచ్చుకున్న డబ్బాలు, ఇతర కంటైనర్లతో పాటు వాహనాల్లోనూ నూనెను నింపుకుని తీసుకెళ్లినట్లు సమాచారం. కొందరు రోడ్డుపై పడిన నూనెను సేకరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ప్రమాదం కారణంగా రోడ్డుపై నూనె భారీగా పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి నెలకొంది. నూనె జారుడు కారణంగా మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ, స్థానికులు దాన్ని సేకరించేందుకు రోడ్డుపైకి రావడం భద్రతాపరంగా ఆందోళన కలిగించింది.

ఈ ఘటన నేపథ్యంలో ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, సంబంధిత సిబ్బంది ఎందుకు వేగంగా స్పందించలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రోడ్డుపై చిందిన నూనెను సురక్షితంగా తొలగించడంతో పాటు, ప్రజలను అక్కడి నుంచి దూరంగా ఉంచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు, ట్రక్కు డ్రైవర్ పరిస్థితిపై అధికారులు వివరాలు వెల్లడించాల్సి ఉంది.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us