AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket Scandals : మ్యాచ్ ఫిక్సింగ్, బాల్ టాంపరింగ్, వాకౌట్.. క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన స్కాండల్స్

Cricket Scandals : క్రికెట్ చరిత్రలో మ్యాచ్ ఫిక్సింగ్, శాండ్‌ పేపర్‌ గేట్, అండర్ ఆర్మ్ బౌలింగ్, బ్రాడ్ నాట్ అవుట్ వివాదం, పాకిస్థాన్ వాకౌట్ వంటి ఘటనలు ప్రపంచాన్ని కుదిపేశాయి. జెంటిల్‌మెన్ గేమ్‌లో చోటుచేసుకున్న అతిపెద్ద స్కాండల్స్‌పై ప్రత్యేక కథనం.

Cricket Scandals : మ్యాచ్ ఫిక్సింగ్, బాల్ టాంపరింగ్, వాకౌట్.. క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన స్కాండల్స్
Cricket Scandals (1)
Rakesh
|

Updated on: Jul 29, 2026 | 12:23 PM

Share

Cricket Scandals : క్రికెట్‌ను ఎప్పుడూ ఒక జెంటిల్ మెన్ గేమ్‎గా భావిస్తారు. కానీ మొదటి నుంచీ ఈ ఆటలో గెలవడానికి, కొన్నిసార్లు కావాలని ఓడిపోవడానికి జరిగిన మోసాలు చరిత్రతో ఎన్నో ఉన్నాయి. ఇటీవల నార్త్ యార్క్‌షైర్ క్లబ్ క్రికెట్‌లో ఒక ఫీల్డర్ వేళ్లతో చప్పుడు చేస్తూ ఎడ్జ్ అయినట్లు అంపైర్లను బురిడీ కొట్టించారనే వివాదం వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా క్రికెట్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన చీటింగ్ సంఘటనల గురించి వివరంగా తెలుసుకుందాం.

1817: మ్యాచ్ ఓడిపోవడానికే ఆడిన విచిత్ర మ్యాచ్

18వ శతాబ్దం నుంచే క్రికెట్‌కు బెట్టింగ్‎తో బలమైన బంధం ఉంది. 1817లో నాటింగ్‌హామ్‌షైర్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద కామెడీగా మారింది. బుక్‌మేకర్లు ఇచ్చిన డబ్బుల కోసం ఇరు జట్ల ఆటగాళ్లు కావాలని ఓడిపోవడానికి పోటీపడ్డారు. బౌలర్లు వికెట్లు తీయకుండా, బ్యాటర్లు కావాలని అవుట్ అవ్వడానికి ప్రయత్నించారు. ఈ ఘటనలో ఆ కాలంలోనే బెస్ట్ ప్లేయర్ అయిన విలియం లాంబెర్ట్ మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా నిషేధానికి గురైన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.

1979: డెన్నిస్ లిల్లీ అల్యూమినియం బ్యాట్ వివాదం

1979లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ డెన్నిస్ లిల్లీ చెక్క బ్యాట్‌కు బదులుగా అల్యూమినియం బ్యాట్‌తో బ్యాటింగ్‌కు వచ్చి సంచలనం సృష్టించాడు. పబ్లిసిటీ స్టంట్ కోసం చేసిన ఈ పనిపై ఇంగ్లాండ్ కెప్టెన్ మైక్ బ్రీర్లీ అభ్యంతరం తెలిపాడు. ఆ బ్యాట్ వల్ల బంతి పాడువుతోందని ఫిర్యాదు చేయడంతో, అంపైర్లు లిల్లీని బ్యాట్ మార్చమని ఆదేశించారు. చివరకు ఆస్ట్రేలియా కెప్టెన్ గ్రెగ్ ఛాపెల్ వచ్చి చెక్క బ్యాట్ ఇవ్వడంతో, లిల్లీ కోపంతో ఆ అల్యూమినియం బ్యాట్‌ను మైదానంలో 40 గజాల దూరంలోకి విసిరేసి రచ్చ చేశాడు. ఈ ఘటన తర్వాత రూల్స్ మార్చి బ్యాట్ కచ్చితంగా చెక్కతోనే చేయాలని నిబంధన తెచ్చారు.

1981: అండర్ ఆర్మ్ బౌలింగ్ మైండ్ గేమ్‌లు

1981లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో గెలవడానికి న్యూజిలాండ్‌కు ఆఖరి బంతికి 6 పరుగులు కావాల్సి ఉంది. ఆస్ట్రేలియా కెప్టెన్ గ్రెగ్ ఛాపెల్ ఒక కుటిల ఉపాయం పన్నాడు. తన తమ్ముడు ట్రెవర్ ఛాపెల్‌ను బంతిని విసిరేయకుండా, నేల కేసి దొర్లించే వేయమని ఆదేశించాడు. ఇది సాంకేతికంగా నిబంధనలకు వ్యతిరేకం కాకపోయినా, క్రీడా స్ఫూర్తిని దారుణంగా దెబ్బతీసింది. దీంతో కోపంతో కివీస్ బ్యాటర్ బ్యాట్‌ను విసిరేసాడు. ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో అండర్ ఆర్మ్ బౌలింగ్‌ను క్రికెట్ కౌన్సిల్ పూర్తిగా నిషేధించింది.

1995 & 2006: మ్యాచ్ వాకౌట్

1995 మెల్‌బోర్న్ టెస్టులో ఆస్ట్రేలియా అంపైర్ డారెల్ హెయిర్, శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ను టార్గెట్ చేసి వరుసగా 7 సార్లు నో బాల్స్ ఇచ్చి హ్యాండ్ బౌలింగ్ చేస్తున్నాడని అవమానించాడు. ఆ తర్వాత 2006లో ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు బాల్ టాంపరింగ్ చేసిందని అంపైర్ డారెల్ హెయిర్ 5 పాయింట్ల పెనాల్టీ విధించడంతో ఆగ్రహించిన పాక్ జట్టు టీ విరామం తర్వాత మైదానంలోకి రావడానికి నిరాకరించింది. ఫలితంగా అంపైర్లు బెయిల్స్ పడేసి మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌కు కేటాయించారు. టెస్ట్ చరిత్రలోనే ఒక జట్టు మ్యాచ్‌ను వాకౌట్ చేయడం అదే తొలిసారి.

2013, 2018 & 2023: బ్రాడ్, శాండ్‌పేపర్, క్యారీ రచ్చలు

2013 (స్టూవర్ట్ బ్రాడ్): యాషెస్ సిరీస్‌లో స్పష్టంగా బ్యాట్‌కు బంతి తగిలి స్లిప్‌లో క్యాచ్ వెళ్లినా, అంపైర్ అలీమ్ దార్ అవుట్ ఇవ్వకపోవడంతో బ్రాడ్ మైదానం వీడకుండా ముఖం చాటేసి బ్యాటింగ్ కొనసాగించి ఇంగ్లాండ్‌ను గెలిపించాడు.

2018 (శాండ్‌పేపర్‌గేట్): సౌతాఫ్రికాతో టెస్టులో ఆస్ట్రేలియా ప్లేయర్ కేమరాన్ బాన్‌క్రాఫ్ట్ జేబులో శాండ్‌పేపర్ పెట్టుకుని బంతిని రుద్దుతూ కెమెరాలకు దొరికిపోయాడు. దీని వెనుక కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ ఉన్నారని తేలడంతో వారిద్దరిపై ఏడాద పాటు నిషేధం పడింది.

2023 (అలెక్స్ క్యారీ రన్ అవుట్): జానీ బెయిర్‌స్టో ఓవర్ పూర్తయిందని భావించి క్రీజ్ వదిలి బయటకు రాగా, వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ బంతిని వికెట్లపైకి విసిరి అవుట్ చేశాడు. సాంకేతికంగా ఇది అవుట్ అయినా, క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పెద్ద ఎత్తున రచ్చ జరిగింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us