AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏసీ 24 గంటలు వాడినా కరెంట్ బిల్లు తక్కువ రావాలా..ఈ సీక్రెట్ టిప్స్ పాటిస్తే చాలు..

మార్చి నెల మొదలైందో లేదో.. అప్పుడే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బయట అడుగుపెడితే సెగలు.. ఇంట్లో ఉంటే ఉక్కపోత.. మండుతున్న ఈ ఎండల నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు ప్రతి ఇంట్లో ఏసీ తప్పనిసరి అయిపోయింది. కానీ ఏసీ ఆన్ చేయాలంటేనే చాలామందికి దాన్ని కరెంటు బిల్లు భయం పట్టుకుంటుంది. కరెంటు బిల్లును కంట్రోల్ చేసే గోల్డెన్ టిప్స్ ఏంటంటే..?

ఏసీ 24 గంటలు వాడినా కరెంట్ బిల్లు తక్కువ రావాలా..ఈ సీక్రెట్ టిప్స్ పాటిస్తే చాలు..
How To Reduce Ac Electricity Bill
Krishna S
|

Updated on: Mar 07, 2026 | 10:49 AM

Share

సీజన్ ప్రారంభంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఇళ్లలో ఏసీల వినియోగం అప్పుడే మొదలైపోయింది. అయితే ఏసీ వాడకం ఎంత హాయినిస్తుందో నెల ఆఖర్లో వచ్చే విద్యుత్ బిల్లు అంతలా భయపెడుతుంటుంది. కానీ కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు, స్మార్ట్ పద్ధతులు పాటిస్తే ఏసీ సామర్థ్యాన్ని పెంచుకుంటూనే, కరెంటు బిల్లును భారీగా తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ ఏసీని కూడా స్మార్ట్ థర్మోస్టాట్‌తో అనుసంధానించడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని నియంత్రించవచ్చు. ఇవి ఇంటర్నెట్‌తో పని చేస్తాయి కాబట్టి మీరు ఇంట్లో లేకపోయినా మొబైల్ ఫోన్ ద్వారా ఏసీని ఆపవచ్చు. ముఖ్యంగా ఇందులో ఉండే జియో-ఫెన్సింగ్ ఫీచర్ మీరు గదిలో లేనప్పుడు ఆటోమేటిక్‌గా ఏసీని ఆఫ్ చేస్తుంది. అలాగే ఆక్యుపెన్సీ సెన్సార్లు గదిలో మనుషులు లేనప్పుడు చల్లదనాన్ని తగ్గించి పవర్ ఆదా చేస్తాయి.

గాలి చొరబడకుండా జాగ్రత్తలు

ఏసీ ఆన్ చేసినప్పుడు తలుపులు, కిటికీలు మూసి ఉంచడం పాత పద్ధతే అయినా అత్యంత ప్రభావవంతమైనది. బయటి నుంచి వెచ్చని గాలి రాకుండా ఉంటే గది ఎక్కువ సేపు చల్లగా ఉంటుంది. కిటికీలకు మందపాటి కర్టెన్లు వాడటం వల్ల నేరుగా సూర్యకాంతి లోపలికి రాదు. దీనివల్ల ఏసీపై ఒత్తిడి తగ్గి కరెంటు ఆదా అవుతుంది.

ఉష్ణోగ్రత సెట్టింగ్‌లో జాగ్రత్త

చాలా మంది గది త్వరగా చల్లబడాలని ఏసీని 16 లేదా 18 డిగ్రీల వద్ద పెడతారు. కానీ ఇది విద్యుత్ వినియోగాన్ని విపరీతంగా పెంచుతుంది. నిపుణుల సలహా ప్రకారం ఏసీని 24 నుండి 26 డిగ్రీల మధ్య ఉంచడం వల్ల శరీరానికి కావాల్సిన చల్లదనం అందడమే కాకుండా బిల్లు కూడా అదుపులో ఉంటుంది. అలాగే ఏసీలో ఉండే ఎకో మోడ్ లేదా ఎనర్జీ సేవింగ్ మోడ్‌ను వాడటం మర్చిపోవద్దు.

గదికి తగ్గ ఏసీ.. సరైన ఎంపిక

గది విస్తీర్ణానికి తగిన సామర్థ్యం ఉన్న ఏసీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. చిన్న గదిలో పెద్ద ఏసీ పెట్టడం వల్ల విద్యుత్ వృధా అవుతుంది. అలాగే పెద్ద గదిలో చిన్న ఏసీ పెడితే అది గదిని చల్లబరచడానికి నిరంతరం కష్టపడాల్సి వస్తుంది. గది సైజును బట్టి సరైన టన్ను ఏసీని ఎంచుకోవడం వల్ల ఏసీ జీవితకాలం కూడా పెరుగుతుంది.

స్లీప్ మోడ్ మ్యాజిక్

రాత్రిపూట నిద్రపోయేటప్పుడు స్లీప్ మోడ్ ఆన్ చేయడం వల్ల ఏసీ ఉష్ణోగ్రత క్రమంగా మన శరీరానికి అనుగుణంగా సర్దుబాటు అవుతుంది. ఇది అర్థరాత్రి గది మరీ చల్లగా అవ్వకుండా చూడటమే కాకుండా విద్యుత్ వాడకాన్ని తగ్గిస్తుంది.

ఏసీని కేవలం ఒక యంత్రంలా కాకుండా పైన చెప్పిన స్మార్ట్ పద్ధతులతో వాడితే వేసవి తాపం నుంచి ఉపశమనం లభించడమే కాకుండా, మీ బడ్జెట్ కూడా అదుపులో ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ చిట్కాలను ఇప్పుడే పాటించడం మొదలుపెట్టండి.

Follow Us
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు
పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు