AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓటర్ ఐడీలో అడ్రస్ మార్చుకోవాలా..? ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు.. ఒకే క్లిక్‌తో ఇలా..

ఓటర్ ఐడీలో అడ్రస్ మార్చుకోవాలా.. లేక అడ్రస్‌లో తప్పులున్నాయా.. అయితే మీరు సులువుగా ఆన్‌లైన్ ద్వారా మార్చుకునే అవకాశముంది. ఒక్క రూపాయి కూడా ఇందుకు చెల్లించనక్కర్లేదు. ఉచితంగా మీరు ఆన్ లైన్ ద్వాారా నిమిషాల్లోనే మార్చుకోవచ్చు. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది.

ఓటర్ ఐడీలో అడ్రస్ మార్చుకోవాలా..? ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు.. ఒకే క్లిక్‌తో ఇలా..
Voter Id
Venkatrao Lella
|

Updated on: Nov 23, 2026 | 3:13 PM

Share

ఓటరు గుర్తింపు కార్డు అనేది చాలా మఖ్యమైన డాక్యుమెంట్‌గా చెప్పవచ్చు. కేవలం మీ ఓటు హక్కును వినియోగించుకోవడానికి మాత్రమే కాకుండా ఒక ప్రధాన వ్యక్తిగత ధృవీకరణ పత్రంగా కూడా ఉపయోగపడుతుంది. దీంతో ఈ కార్డులో మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ, అడ్రస్, ఇతర వివరాలు తప్పుల్లేకుండా చూసుకోవాలి. అయితే కొంతమంది తరచూ ఇల్లు మారుతుంటారు. ఇలాంటివారు తమ ఓటర్ ఐడీలోని అడ్రస్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే అడ్రస్‌లో ఏమైనా తప్పులు ఉన్నా సులువుగా మార్చుకోవచ్చు. ఈ ప్రక్రియ ఎలా అనేది చూద్దాం.

అడ్రస్ మార్చుకోవడం ఎలా..?

-ఓటర్ సిటిజన్ పోర్టల్ ఓపెన్ చేయండి

-హోమ్‌పేజీలో అడ్రస్ మార్పు అనే ఆప్షన్ ఎంచుకోండి

-‘ఫారం 8’ బటన్‌పై క్లిక్ చేయండి

-‘సెల్ఫ్’ ఎంపికను ఎంచుకుని, ‘సమర్పించు’ పై క్లిక్ చేయండి

-‘నివాస మార్పు’ ఆప్షన్ ఎంచుకోండి

-‘ఆ తర్వాత ‘శాసనసభ నియోజకవర్గం లోపల’ లేదా ‘శాసనసభ నియోజకవర్గం వెలుపల’ అనేది ఎంచుకోండి

-‘మీ రాష్ట్రం, జిల్లా, శాసనసభ/పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఎంచుకోండి

-మీ ఆధార్ నంబర్, ఇమెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్‌ను అందించండి

-అవసరమైన పత్రాలతో పాటు మీ కొత్త చిరునామాను నమోదు చేయండి

-అడ్రస్ ప్రూఫ్ కోసం ఏదైనా డాక్యుమెంట్ అప్ లోడ్ చేయండి

-డిక్లరేషన్‌ను పూర్తి చేసి, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి

-అనంతరం మీ అప్లికేషన్‌ను సమర్పించండి

కొత్త కార్డు వస్తుందా..?

మీరు అడ్రస్ మార్పు లేదా అప్డేట్ కోసం సమర్పించిన తర్వాత భారత ఎన్నికల సంఘం మీ అభ్యర్థనను పరిశీలించే ప్రక్రియను ప్రారంభిస్తుంది. బీఎల్ఓ, పై అధికారులు పరిశీలించిన తర్వాత ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తవుతుంది. అనంతరం మీ ఓటరు గుర్తింపు కార్డుకు అవసరమైన మార్పులు చేయబడతాయి. మీరు ఆన్ లైన్ ద్వారా కొత్త కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Follow Us