టోల్ ఫీజు ఎగ్గొడుతున్నారా? రూ.10 వేల వరకు జరిమానా.. కొత్త రూల్స్!
నెంబర్ ప్లేట్ ట్యాపరింగ్‌కు పాల్పడేవారిపై కేంద్ర రోడ్డు, రవాణాశాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. హైవేలపై కొంతమంది టోల్ ఛార్జీ ఎగ్గొట్టేందుకు తమ వాహన నెంబర్ కనిపించకుండా చేయడం, మట్టి పూయడం లాంటివి చేస్తున్నారు. ఇలాంటివాటి వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది. దీంతో ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోనుంది.

నేషనల్ హైవేలపై ప్రయాణించే వాహనదారులకు బిగ్ అలర్ట్. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నెంబర్ ప్లేట్ ట్యాపరింగ్‌కు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంది. టోల్ ఫీజు ఎగ్గొట్టేందుకు కొంతమంది వాహనదారులు నెంబర్ ప్లేట్ల ట్యాపరింగ్‌కు పాల్పడుతున్నారు. నెంబర్ ప్లేట్‌ను వంచడం, నల్ల స్టిక్కర్లు వంచడం, టేప్ అంటించడం, మట్టి పూడయం, కెమెరాలకు కనిపించకుండా నెంబర్ ప్లేట్ దాచడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి పనులకు పాల్పడటంపై కేంద్ర రోడ్డు రవాణాశాఖ తీవ్రంగా స్పందింది. ఇలాంటి పనులకు పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వీరికి రూ.10 వేల వరకు జరిమానా విధించనన్నట్లు ప్రకటించింది.
నెంబర్ ప్లేట్ల ట్యాపరింగ్‌కు పాల్పడితే టోల్ ఫీజు ఎగ్గొడితే టోల్ ఛార్జీ కంటే 4 నుంచి 8 రెట్లు అధికంగా పెనాల్టీ విధించనుంది. ఈ మేరకు కేంద్రం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. టోల్ ఛార్జీలపై జరిమానాలకు అదనంగా మొదటిసారి తప్పుకు రూ.5 వేల జరిమానా విధించనుండగా.. రెండోసారి కూడా తప్పు చేస్తే రూ.10 వేలు విధిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను టోల్ ప్లాజాల వద్ద ప్రవేశపెట్టనున్నాయి. ఈ వ్యవస్థ నెంబర్ ప్లేట్ల ట్యాపరింగ్‌ను గుర్తించనుంది. కొంతమంది నెంబర్లు ట్యాపరింగ్ చేయడం వల్ల కేంద్రం భారీగా ఆదాయాన్ని కోల్పోతుంది. దీనిని నివారించేందుకు కఠిన రూల్స్ తీసుకొస్తున్నారు.
దేశవ్యాప్తంగా 7 బారియర్ లెస్ టోల్ ప్లాజాలు ఉన్నాయి. అంటే వాహనం ఆగాల్సిన పని లేదు. ఆటోమేటిక్‌గా కెమెరాలు, , RFID రీడర్ల ద్వారా వాహన నెంబర్ ప్లేట్‌ను గుర్తించి టోల్ కట్ అవుతుంది. కొంతమంది వాహన ప్లేట్ ట్యాపరింగ్‌కు పాల్పడితే టోల్ ఎగ్గొడుతున్నారు. దీని వల్ల NHAI భారీగా ఆదాయం కోల్పోతోంది. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ కొత్త టోల్ సిస్టమ్ తీసుకొస్తున్నారు. ఇక నుంచి ఉల్లంఘనకు పాల్పడితే టోల్ ఫీజుకు అదనంగా 4 నుంచి 8 రెట్లు వసూలు చేస్తారు. ఉదాహరణకు టోల్ ఛార్జీ రూ.150గా ఉంటే రూ.600 నుంచి రూ.1200 వరకు కట్టాల్సి ఉంటుంది. అలాగే అదనంగా రూ.5 వేలు, రూ.10 వేలు జరిమానా ఉంటుంది. రానన్న రెండు నెలల్లో ఈ వ్యవస్థ ఏర్పాటు కోసం హైస్పీడ్ కెమెరాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని జోడించనున్నారు. ఏఐ ఇమేజ్ అనాలిసిస్ ద్వారా నెంబర్ ప్లేట్ ట్యాపరింగ్‌కు పాల్పడినవారిని గుర్తిస్తారు. అనంతరం జరిమానా విధిస్తారు. దీని వల్ల నెంబర్ ప్లేట్ల ట్యాపరింగ్‌కు చెక్ పడుతుందని కేంద్రం భావిస్తోంది.
