AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమ అనేది ఓ అందమైన అనుభూతి.. ఆమె నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా..

సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అక్కినేని నాగచైతన్య. ఎప్పటికప్పుడు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు విజయవంతమైన చిత్రాలతో ఆకట్టుకున్న ఆయన.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

Rajeev Rayala
|

Updated on: Nov 23, 2026 | 2:12 PM

Share
సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అక్కినేని నాగచైతన్య. ఎప్పటికప్పుడు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు విజయవంతమైన చిత్రాలతో ఆకట్టుకున్న ఆయన.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’ చిత్రంతో అలరించనున్నారు. ఈ క్రమంలో తన సినీ ప్రయాణం, ప్రేమ, కుటుంబం, భార్య శోభిత గురించి నాగచైతన్య చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

1 / 5
సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా సరే తమ ప్రతిభతోనే గుర్తింపు తెచ్చుకోవాలని నాగచైతన్య అభిప్రాయపడ్డారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి కష్టపడుతున్న కొత్తవారిని చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుందని తెలిపారు. ఫేక్ పీఆర్, మార్కెటింగ్‌తో ఎక్కువ కాలం ప్రేక్షకులను ఆకట్టుకోవడం సాధ్యం కాదని, ఒక సినిమాకు అసలైన బలం ప్రేక్షకుల నుంచి వచ్చే మౌత్ టాక్ మాత్రమేనని పేర్కొన్నారు. ఇండస్ట్రీలోకి వచ్చి 16 ఏళ్లు గడిచినా నటుడిగా ఇంకా ఎన్నో సాధించాలనే తపన తనలో ఉందని చెప్పారు. నాగచైతన్య ఎలాంటి పాత్రనైనా చేయగలడనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో సంపాదించుకోవాలనేది తన లక్ష్యమని వెల్లడించారు.

2 / 5
సమయాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని తన తాత అక్కినేని నాగేశ్వరరావు నుంచే నేర్చుకున్నానని చైతన్య తెలిపారు. ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభూతి అని చెప్పారు. ముఖ్యంగా ‘మనం’ సినిమాలో ఏఎన్నార్‌తో కలిసి నటించడం తనకు ఎంతో ప్రత్యేకమని గుర్తుచేసుకున్నారు. ఆ సినిమాలో తాతయ్యను ఏరా, అదీ ఇదీ అంటూ పిలవాల్సి వచ్చేదని, నిజ జీవితంలో ఎంతో గౌరవించే వ్యక్తిని అలా పిలవడం మొదట్లో కొంత ఇబ్బందిగా అనిపించిందని వెల్లడించారు.

3 / 5
ప్రేమ గురించి తన అభిప్రాయాలను పంచుకుంటూ నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేమ అనేది పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టమైన అందమైన అనుభూతి అని అన్నారు. తాను ఇప్పటికీ ప్రేమ విషయంలో కొంత కన్ఫ్యూజన్‌లోనే ఉన్నానని సరదాగా పేర్కొన్నారు. ముఖ్యంగా టీనేజ్‌లో ప్రేమను మరీ సీరియస్‌గా తీసుకోకూడదని, దాని గురించి ఆందోళన చెందకుండా ఆ వయసులో కలిగే అనుభూతులను ఆస్వాదించాలని సూచించారు. ప్రేమలో ఎదురయ్యే తప్పుల నుంచి కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని తెలిపారు.

4 / 5
భార్య శోభిత ధూళిపాళ్ల గురించి మాట్లాడుతూ ఆమె వ్యక్తిత్వంలోని ఓ ప్రత్యేకమైన లక్షణాన్ని నాగచైతన్య వెల్లడించారు. తాను అనుకున్నది జరగకపోతే అదే విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండిపోతానని, కానీ శోభిత మాత్రం పరిస్థితులకు అనుగుణంగా వెంటనే నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతుందని చెప్పారు. ఆమె నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. శోభితకు ఫ్యాషన్‌పై ఎంతో ఆసక్తి ఉందని చెప్పిన నాగచైతన్య.. తన లుక్, ఫ్యాషన్ సెన్స్‌లో వచ్చిన మార్పులకు ఆమెనే కారణమని వెల్లడించారు. తన వార్డ్‌రోబ్‌లో ఇప్పటికే దాదాపు 20 శాతం మార్పులు చేసిందని సరదాగా చెప్పారు. తన డ్రెస్సింగ్ స్టైల్‌ను మరింత మెరుగుపరచడంలో శోభిత పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు. దీంతో నాగచైతన్య చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

5 / 5
Follow Us