శోభితా ధూళిపాళ
పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ శోభితా ధూళిపాళ. 1992 మే 31న ఆంధ్రప్రదేశ్ తెనాలిలోని ఓ తెలుగు బ్రహ్మాణ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి వేణుగోపాలరావు మర్చంట్ నేవీ ఇంజనీర్. తల్లి కామాక్షి పాఠశాల ఉపాధ్యాయురాలు. లా చదువుకోవడానికి ముంబై విశ్వవిద్యాలయంలో చేరిన శోభిత.. కూచిపూడి, భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. 2013లో ఫెమినా మిస్ ఇండియా 2013 పోటీలో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత 2016లో రామన్ రాఘవ్ 2.0 సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2018లో గూడాచారి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శోభితా తమిళం, హిందీ, తెలుగు భాషలలో సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తుంది. అలాగే మంకీ మ్యాన్ సినిమాతో హాలీవుడ్ సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అక్కినేని నాగచైతన్యతో శోభితా దూళిపాళ నిశ్చితార్థం జరిగింది. వీరిద్దరి వివాహం 2024 డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.