AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhil Akkineni: పెళ్లైన ఇన్ని రోజులకు వెడ్డింగ్ ఫొటోస్ షేర్ చేసిన అఖిల్.. ఎవరెవరు వచ్చారో చూశారా?

అక్కినేని నాగార్జున రెండో కుమారుడు టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ నివాసం వేదికగా జైనబ్ రవ్డీతో కలిసి ఏడడుగులు నడిచాడు. తాజాగా తమ పెళ్లి వేడుకల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు అఖిల్.

Basha Shek
|

Updated on: Jun 29, 2025 | 7:28 PM

Share
 అక్కినేని అందగాడు అఖిల్- జైనాబ్‌ల పెళ్లి వేడుక అట్టహాసంగా జరిగింది. జూన్ 6న జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, స్నేహితులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

1 / 6
 పెళ్లి వేడుక తర్వాత 8న రిసెప్షన్ వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా జరిగిన రిసెప్షన్‌ వేడుకలో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు

2 / 6
  కాగా పెళ్లి వేడుక తర్వాత ఇటీవలే ఇన్ స్టా గ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు అఖిల్.  భార్యతో కలిసున్న ఫొటోలను షేర్ చేస్తూ ' నా జీవితంలో అత్యుత్తమ రోజులో కొన్ని క్షణాలను మీతో పంచుకోవాలని నా హృదయానికి అనిపించింది' అంటూ క్రేజీ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు అఖిల్.

3 / 6
అలాగే తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు అందించిన వారిందరికీ ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశాడు అక్కినేని అఖిల్. ఈ పోస్ట్, అందులోని ఫొటోలు అక్కినేని అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి

4 / 6
 తాజాగా  తన పెళ్లి వేడుకలకు సంబంధించి మరికొన్ని ఫొటోలను షేర్ చేశాడు అఖిల్. ఇందులో అఖిల్- జైనబ్ లతో పాటు నాగ చైతన్య- శోభిత, అమల, చిరంజీవి, రాజమౌళి, రామ్ చరణ్ తదతర సెలబ్రిటీలను చూడవచ్చు

5 / 6
 ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం లెనిన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు అఖిల్. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించవచ్చని ప్రచారం జరుగుతోంది.

6 / 6