తమ్ముడితో చిన్ననాటి ఫోటోస్ షేర్ చేసిన హీరోయిన్.. గుర్తుపట్టారా.. ?

Rajitha Chanti

Pic credit - Instagram

18 March 2026

ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని చిన్ననాటి ఫోటోస్ షేర్ చేసింది. అందులో తన తమ్ముడితో కలిసి క్యూట్ గా కనిపిస్తుంది.

పైన ఫోటోను చూశారా.. ? అందులో కనిపిస్తున్న ఈ చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది ఈ ముద్దుగుమ్మ.

ఆమె మరెవరో కాదు .. కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. ప్రేమమ్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసి.. అఆ మూవీతో టాలీవుడ్ సినీరంగంలోకి నటిగా అడుగుపెట్టింది. 

ఆ తర్వాత శతమానం భవతి సినిమాతో కథానాయికగా మారింది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించి గుర్తింపు తెచ్చుకుంది ఈ వయ్యారి. 

తెలుగులో అత్యధిక చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా దూసుకుపోతుంది.

ఇన్నాళ్లు గ్లామర్ షోకు దూరంగా ఉన్న అనుపమ.. టిల్లు స్క్వేర్ సినిమాతో రూటు మార్చింది. ఈ మూవీలో అనుపమ లుక్స్ చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోయారు.

ప్రస్తుతం నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. అలాగే నటిగా ప్రశంసలు అందుకుంటుంది.

ఇప్పుడు అనుపమ షేర్ చేసిన త్రోబ్యాక్ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తన తమ్ముడికి బర్త్ డే విషెస్ తెలుపుతూ పోస్ట్ చేసింది.