AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగ చైతన్య లేకుండ నేను పరిపూర్ణంకాదు.. పెళ్లి వీడియో షేర్ చేసిన శోభిత.. విశేషం ఏంటంటే

సమంత.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగుతున్న పేరు. స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత.. తాజాగా రెండో వివాహం చేసుకుంది. సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకున్నారు. సోమవారం (డిసెంబర్ 1)న వీరిద్దరు కోయంబత్తూరులోని లింగభైరవి ఆలయంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.

నాగ చైతన్య లేకుండ నేను పరిపూర్ణంకాదు.. పెళ్లి వీడియో షేర్ చేసిన శోభిత.. విశేషం ఏంటంటే
Naga Chaitanya, Shobitha
Rajeev Rayala
|

Updated on: Dec 04, 2025 | 4:54 PM

Share

సమంత పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగుతుంది. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత తాజాగా రాజ్ నిదమూరిని పెళ్లి చేసుకున్నారు. గత కొద్దిరోజులుగా రిలేషన్ లో ఉన్న ఈ ఇద్దరూ సోమవారం రోజు వివాహబంధంతో ఒక్కటయ్యారు. దర్శకుడు రాజ్ తెరకెక్కించిన ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో సమంత నటించారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తుంది. ఆతర్వాత చట్టపట్టాలేసుకు తిరుగుతూ మీడియా కంటపడ్డారు. కాగా డిసెంబర్ 1న వీరిద్దరు కోయంబత్తూరులోని లింగభైరవి ఆలయంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సమంత -రాజ్ లకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అయితే సమంత రెండో వివాహం పై కొందరు ఆమెకు అభినందనలు తెలుపుతుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే సామ్ తో విడిపోయిన తర్వాత నాగ చైతన్య హీరోయిన్ శోభితతో ప్రేమలో పడ్డాడు. కొంతకాలం ప్రేమలో తేలిపోయిన ఈ జంట తర్వాత పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ఇక ఇప్పుడు సామ్ రెండో పెళ్లి వార్త వైరల్ గా మారిన నేపథ్యంలో శోభిత సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు.

గత ఏడాది డిసెంబర్ 4న చైతన్య శోభిత వివాహం జరిగింది. వీరి వివాహం జరిగి నేటికీ ఏడాది పూర్తికావడంతో కొన్ని మధురజ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకుంది శోభిత. పెళ్లి వీడియోను అభిమానులతో పంచుకుంది శోభిత. పెళ్లిలో చేసిన అల్లరి, చైతన్య తనకు ఎంత ఇష్టమో ఈ వీడియోలో చూపించింది శోభిత. అలాగే ఈ వీడియోకి ” ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చాకే మనం పరిపూర్ణం అవుతామన్నది నిజమో కాదో నాకు తెలియదు. కానీ, నాగ చైతన్య లేకుండ నేను పరిపూర్ణం కాదు” అంటూ రాసుకొచ్చింది. నాగ చైతన్య సైతం శోభితపై ప్రేమ కురిపించాడు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గామారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.