ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. దెబ్బకు క్యూ కట్టిన ఆఫర్స్..

Rajitha Chanti

Pic credit - Instagram

09 March 2026

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన మారుమోగుతున్న పేరు శివాని నాగరం. ఇప్పుడు సినీరంగంలో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. 

యూట్యూబర్ గా కెరీర్ స్టా్ర్ట్ చేసిన ఈ అమ్మడు ఇప్పుడు తెలుగులో బిజీ హీరోయిన్ అయ్యింది. లిటిల్ హార్ట్స్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. 

చిన్న సినిమాగా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో మౌళి హీరోగా నటించగా..సూపర్ హిట్ అయ్యింది.

కాత్యాయని పాత్రలో కథానాయికగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. నటిగానే కాకుండా సింగర్ గానూ.. కూచిపూడి డ్యాన్సర్ గానూ మెప్పించింది.

1998లో హైదరాబాద్ లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ చిన్నతనం నుంచే కూచిపూడి నేర్చుకుంది. విల్లా మేరీ కాలేజీలో కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసింది.

అంతర్గత అనే షార్ట్ ఫిల్మ్ గా నటిగా మారింది. 2020లో మిస్టర్ గర్ల్ ఫ్రెండ్ అనే వెబ్ సిరీస్ చేసింది. అంబాజీపేట మ్యారేజీ బ్యాండు చిత్రంలో ఛాన్స్ అందుకుంది.

ఖాళీ సమయంలో పిల్లలకు మ్యూజిక్, డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఇన్ స్టాలో రీల్స్ షేర్ చేస్తూ న్యూస్ ప్రెజెంటర్ గా నటించింది.

 ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. ఇప్పుడు నెట్టింట రోజుకో ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.