తెలుగు భాష నాకు బ్రతుకునిచ్చింది.. బాలీవుడ్ హీరోయిన్ ఎమోషనల్..
Rajitha Chanti
Pic credit - Instagram
09 March 2026
రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.
మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది.
తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది. మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోస్ అందరితో నటించింది.
ఒకప్పుడు తెలుగులో అత్యధిక చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత ఏమయిందో తెలియదు కానీ ఆకస్మాత్తుగా టాలీవుడ్ కు దూరమైంది.
హిందీలోనే వరుస సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయ్యింది. తన ప్రియుడు బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుని కొత్త జీవితం స్టార్ట్ చేసింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ అమ్మడు తెలుగు భాష గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తెలుగు భాషను తాను అస్సలు మర్చిపోలేనని తెలిపింది.
తన మాతృభాషా పంజాబీ కన్నా తెలుగు స్పష్టంగా మాట్లాడతానని అన్నారు. ఒక్కోసారి తాను పంజాబీ మాట్లాడుతుంటే మధ్యలో తెలుగు పదాలు వస్తాయట.
అలాగే తనకు బతుకునిచ్చిన భాష తెలుగు అని.. అక్కడే ఎక్కువగా ఆదరించారని.. అలాంటి భాషను ఎలా మర్చిపోగలను అంటూ చెప్పుకొచ్చింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్