AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వారికి ఆర్థిక ఒత్తిడి నుంచి కాస్త ఊరట.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (March 10, 2026): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: వారికి ఆర్థిక ఒత్తిడి నుంచి కాస్త ఊరట.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Daily Horoscope 10 March 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 10, 2026 | 5:31 AM

Share

దిన ఫలాలు (మార్చి 10, 2026): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు శుభవార్తలు అందే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిచ్చే సూచనలు ఉన్నాయి.  మిథున రాశి వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో మీ పనితీరుకు, సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కుటుంబ పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి కలుగుతుంది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ముఖ్యమైన పనులు, వ్యవహారాలు ఆశించిన విధంగా పూర్తవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. కొందరు ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకుని, విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు, సహోద్యోగుల్ని పని తీరుతో ఆకట్టుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో విహార యాత్ర చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే సాగిపోతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా పురోగమిస్తాయి. ఇతరుల వాద వివాదాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. కుటుంబ పెద్దల ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. ఆదాయం బాగానే పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలను పట్టుదలగా కొనసాగిస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది కానీ, ఇంటి ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇష్టమైన వ్యక్తులతో విందులు వినోదాలతో సరదాగా గడుపుతారు. పిల్లల విషయంలో ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు. ఆర్థిక ఒత్తిడి నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఆహార, విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వ్యాపారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ముఖ్యమైన పనుల్ని, వ్యవహా రాల్ని తేలికగా పూర్తి చేస్తారు. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ముందుకు సాగకపోవచ్చు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగి పోతాయి. బాకీలు, బకాయిలు పూర్తిగా వసూలవుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందు తాయి. ఆర్థిక ప్రయత్నాలు నూరు శాతం అనుకూల ఫలితాలనిస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరగడం, మంచి గుర్తింపు లభించడం వంటివి జరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లలు బాగా పురోగతి సాధిస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రోజంతా సంతృప్తికరంగా, సానుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లల చదువుల మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా సాగిపోతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. మీ సలహాలు, సూచనలకు విలువ ఏర్పడుతుంది. జీవిత భాగస్వామికి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలకు ఆఫర్లు అందుతాయి. కొందరు ఇష్టమైన బంధు మిత్రులతో హ్యాపీగా కాలక్షేపం చేస్తారు. బంధువర్గంలో ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థికంగా సమయం బాగా అనుకూలంగా ఉంది. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలం అవు తాయి. షేర్లు బాగా లాభిస్తాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహంగా పురోగమిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. అద నపు ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. కీలక విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని ఆశించిన స్థాయిలో లాభపడతారు. కొత్త ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. అనుకున్న వ్యవహారాలు అనుకున్నట్టు పూర్తవుతాయి. దాంపత్య జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. కుటుంబసమేతంగా ఆలయాలను సందర్శిస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన ప్రతిఫలం అందుతుంది. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బంధుమిత్రుల వల్ల కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలపడతాయి. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో బాగా బిజీ అయిపోతారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అన వసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు భారీగా సహాయం చేయడం జరుగుతుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి, మంచి ఫలితాలు సాధిస్తారు. కొందరు మిత్రుల వల్ల ఇరకాట పరిస్థితులు తలెత్తవచ్చు. సోదరులతో సఖ్యత పెరుగుతుంది.

Follow Us