తెలియని వారి పెళ్లిళ్లకు లేదా వేడుకలకు వెళ్తే జైలు శిక్ష, జరిమానా తప్పదా? ఫంక్షన్లకు సంబంధం లేని వ్యక్తులు దొరికినచో సెక్షన్ 441 ప్రకారం మూడు నెలల జైలు, ఐదు వేల జరిమానా విధిస్తారంటూ ఓ బోర్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతిథి దేవోభవ నినాదంతో కొందరు విభేదిస్తుండగా, మరికొందరు ఆతిథ్యం ఇచ్చేవారి ప్రతిష్టకు భంగం కలుగుతుందని సమర్థిస్తున్నారు.