- Telugu News Photo Gallery Cinema photos Shaari movie actress Aaradhya Devi says she is ready to do any role
చేసింది ఒకేఒక్క సినిమా..! కట్ చేస్తే.. ఎలాంటి పాత్రకైనా రెడీ అంటున్న వయ్యారి..
సినిమా ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ కు కొదవే లేదు.. సినిమా సినిమాకు ఓ కొత్త అందం ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. ఇప్పటికే ఇతర బాషలనుంచి చాలా మంది హీరోయిన్స్ మనదగ్గర సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాగే కొత్త భామలు కూడా బాగానే అవకాశాలు అందుకుంటున్నారు.
Updated on: Dec 04, 2025 | 9:30 PM

సినిమా ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ కు కొదవే లేదు.. సినిమా సినిమాకు ఓ కొత్త అందం ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. ఇప్పటికే ఇతర బాషలనుంచి చాలా మంది హీరోయిన్స్ మనదగ్గర సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాగే కొత్త భామలు కూడా బాగానే అవకాశాలు అందుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఎక్కడ విన్నా ఓ ముద్దుగుమ్మ పేరు వినిపిస్తుంది.

ఎక్కడ చూసిన ఆమె ఫొటోలే కనిపిస్తున్నాయి. మొదటి సినిమా రిలీజ్ కూడా కాలేదు.. కానీ ఆమె ఫాలోయింగ్ , క్రేజ్ చూస్తుంటే మెంటలెక్కాల్సిందే.. అందంతో కుర్రకారును కట్టిపడేస్తుంది ఆమె.. అంతే కాదు అవకాశాలు వస్తే ఎలాంటి పాత్ర అయిన రెడీ అంటుంది.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

అందం అభినయం ఉన్న భామలు ఈ మధ్యకాలంలో అంతగా అవకాశాలు అందుకోలేకపోతున్నారు. కానీ ఈ చిన్నది మాత్రం తన అందంతోనే స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది. ఇంకా మొదటి సినిమా రిలీజ్ కూడా కాలేదు అప్పుడే ఎలాంటి పాత్రైనా సరే రెడీ అంటుంది.

ఇంతకూ ఆమె ఎవరో కాదు రామ్ గోపాల్ వర్మ వదిలిన బాణం ఆరాధ్యదేవి. ఈ అమ్మడి అసలు పేరు శ్రీలక్ష్మీ సతీష్. 23 ఏళ్ల ఈ అందాల భామ ఇప్పుడు హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తోంది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ అమ్మడిని సోషల్ మీడియాలో వెతికి మరీ పట్టుకున్నాడు. సోషల్ మీడియాలో రీల్స్ చేసే ఈ అమ్మడి అందాన్ని చూసి ఫిదా అయిన వర్మ గా పెట్టి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. అనుకున్నట్టుగానే ఆమెను హీరోయిన్ గా పేటి శారీ అనే సినిమా చేశాడు.

ఇదిలా ఉంటే ఇన్ స్టాలో రీల్స్ చేసే సమయంలో చీరకట్టులో పద్దతిగా కనిపించిన ఆరాధ్య.. ఇప్పుడు ఈ రేంజ్ లో రెచ్చిపోయి అందాలు ఆరబోస్తుంటే నెటిజన్స్ షాక్ అవుతున్నారు. గతంలో ఆరాధ్య మాట్లాడుతూ.. అవకాశం వస్తే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి రెడీ అంటుంది. గ్లామర్ పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నానని, అయితే ఇప్పుడు తన అభిప్రాయాలు మారిపోయాయని తెలిపింది.




