- Telugu News Photo Gallery Cinema photos Heroine Meenakshi Chaudhary is receiving offers in big hero films
లక్కీ హీరోయిన్.. బడా హీరోల సినిమాల్లో బంపర్ ఆఫర్ అందుకుంటుంటున్న భామ
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మీనాక్షి చౌదరి. ఈ అమ్మడు ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. వరుస సినిమాలతో యమా బిజీ అయ్యింది ఈ వయ్యారి భామ మొన్నటి వరకు మీనాక్షికి చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు. కానీ ఇప్పుడు క్యూ కడుతున్నాయి.
Updated on: Dec 04, 2025 | 10:14 PM

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మీనాక్షి చౌదరి. ఈ అమ్మడు ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. వరుస సినిమాలతో యమా బిజీ అయ్యింది ఈ వయ్యారి భామ మొన్నటి వరకు మీనాక్షికి చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు. కానీ ఇప్పుడు క్యూ కడుతున్నాయి. అందంతో పాటు నటనతోనూ అదరగొడుతుంది ఈ చిన్నది.

ఇచట వాహనములు నిలుపరాదు అనేసినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది మీనాక్షి. సుశాంత్ హీరోగా నటించిన ఈ సినిమా అంతగా ఆడలేదు. ఆతర్వాత రవితేజ నటించిన ఖిలాడీ సినిమాలో తన గ్లామర్ తో కట్టిపడేసింది. అడవి శేష్ నటించిన హిట్ 2 మీనాక్షికి మంచి గుర్తింపు తెచ్చింది.

ఇక ఇప్పుడు ఈ చిన్నది సెన్సేషన్ గా మారిపోయింది. యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు అన్ని ఆఫర్స్ అందుకుంటుంది. మహేష్ తో గుంటూరు కారం సినిమాలో మెరిసింది. అలాగే తమిళ్ లో దళపతి విజయ్ గోట్ లోనూ కనిపించింది. ఇక రీసెంట్ గా లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో సూపర్ హిట్స్ అందుకొని ఫుల్ జోష్ మీద ఉంది ఈ బ్యూటీ.

ఇక ఇప్పుడు ఈ అమ్మడు లిస్ట్ లో బడా సినిమాలు చాలానే ఉన్నాయి. అలాగే ఒకటి రెండు పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయని టాక్. ఇదిలా ఉంటే మీనాక్షి రీసెంట్ గా తన క్రష్ ఎవరో చెప్పేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీనాక్షి మాట్లాడుతూ.. స్కూల్ టైం లో నాకు ఓ క్రష్ ఉండేది. మా స్కూల్ టీచర్ అంటే నాకు క్రష్ ఉండేది. నా ఒక్కదానికే కాదు మా స్కూల్ లో ఉండే అమ్మాయిలందరికి ఆతని పై క్రష్ ఉండేది.

అతనే నా ఫస్ట్ క్రష్ ఆ తర్వాత ఎవరిపై ఆ ఫీలింగ్ కలగలేదు అని చెప్పుకొచ్చింది. అలాగే జీవితంలోఅందరికి ఎవరో ఒకరి మీద క్రష్ కలుగుతుంది. మా సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా అదే కథతో తెరకెక్కింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది మీనాక్షి.




