AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగాది స్పెషల్: ఈ చిన్న పనులు చేస్తే మీ అదృష్టం మారిపోతుంది!

Ugadi Special: తెలుగు ప్రజలకు ఎంతో ప్రత్యేకమైన పండగ ఉగాది. తెలుగు నూతన సంవత్సరాది కావడంతో ఎంతో సంబరంగా జరుపుకుంటారు. ఈరోజు ఉగాది పచ్చడి చేసుకుని సేవిస్తారు. అంతేగాక, ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే, కొన్ని చిన్న పనులు చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

ఉగాది స్పెషల్: ఈ చిన్న పనులు చేస్తే మీ అదృష్టం మారిపోతుంది!
Ugadi
Rajashekher G
|

Updated on: Mar 18, 2026 | 8:32 PM

Share

మరికొద్ది గంటల్లోనే మనం నూతన తెలుగు సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సంవత్సరం మార్చి 19, గురువారం నాడు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాదిని జరుపుకోనున్నారు. ఈ రోజున చాలా మంది కొత్త బట్టలు ధరించి పూజలు చేసి, ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తారు. ఉగాది రోజున కొన్ని విధివిధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం శుభఫలితాలు లభించి, దేవతల అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు.

పరాభవ నామ సంవత్సరానికి అర్థం:

గతంలో ఎదురైన అపజయాలు, కష్టాలు, బాధలు అన్నింటినీ వెనక్కి నెట్టి, ఆత్మవిశ్వాసంతో కొత్త ఆరంభం చేయాలని సూచించేదే “పరాభవ” అనే పేరుకు అంతరార్థమని జ్యోతిష్య పండితులు వివరిస్తున్నారు.

ఉగాది రోజు చేయాల్సినవి:

ఉగాది పర్వదినం రోజున తెల్లవారుజామున లేచి, శరీరానికి, తలకు నువ్వుల నూనె రాసుకుని స్నానం చేయాలి. దీనిని తైలాభ్యంగ స్నానం అంటారు. అలాగే ఈ రోజున బ్రహ్మదేవుని పూజించడం ముఖ్యమని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే శ్రీమహావిష్ణువు ఆజ్ఞతో బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజు ఇదేనని విశ్వసిస్తారు.

బ్రహ్మదేవుని పూజ విధానం:

బ్రహ్మదేవునికి సాధారణంగా విగ్రహాలు లేదా చిత్రాలు ఉండవు. కాబట్టి ఇలా పూజ చేయాలి:

  • ఇంటి ముందుభాగంలో ఒక చిన్న కర్రను పాతాలి
  • దానికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టాలి
  • దవనం ఉంచి, బెల్లం నైవేద్యంగా సమర్పించాలి
  • హారతి ఇచ్చి, ఆ కర్రను బ్రహ్మదేవునిగా భావించి పూజ చేయాలి
  • ఈ పూజ తర్వాత ఇష్టదైవాన్ని ఆరాధించడం శ్రేయస్కరం. బ్రహ్మదేవునికి దవనం సమర్పిస్తే కోరికలు నెరవేరుతాయని, దేవతల అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. గోపూజ కూడా ఈ రోజున శుభప్రదం.

ఉగాది రోజు చేయాల్సిన దానాలు:

  • ఉగాది రోజున దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు.
  • మామిడి పండ్లు దానం చేస్తే కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్మకం
  • మజ్జిగ లేదా విసనకర్ర దానం చేస్తే జాతక దోషాలు తగ్గి మనశ్శాంతి లభిస్తుంది
  • వస్త్రదానం కూడా శుభఫలితాలను ఇస్తుంది
  • చలివేంద్రాలు ఏర్పాటు చేయడం లేదా నీటి కుండ దానం చేయడం వల్ల పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది.

నీటి కుండ దానం విధానం:

కొత్త కుండను తీసుకుని పసుపు, కుంకుమతో అలంకరించాలి. అందులో నీళ్లు నింపి, పసుపు, కుంకుమ, గంధం, పూలు, అక్షతలు వేయాలి. తర్వాత కొబ్బరికాయపై పసుపు, కుంకుమ రాసి దారంతో కట్టి కుండపై ఉంచి, అర్చకులకు దానం చేయాలి. ఇలా చేస్తే అష్టైశ్వరాలతోపాటు దేవతల ఆశీస్సులు లభిస్తాయని విశ్వాసం.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

Follow Us
యుగానుకూల మాతృత్వంపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
యుగానుకూల మాతృత్వంపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
తీవ్రమైన కాలినొప్పి అని ఆస్పత్రికి వెళ్తే..ఎక్స్‌రే చూసి వైద్యులే
తీవ్రమైన కాలినొప్పి అని ఆస్పత్రికి వెళ్తే..ఎక్స్‌రే చూసి వైద్యులే
వీళ్లు ఎల్‌నినో కంటే యమ డేంజర్‌.. పంటచేలో పచ్చి నకిలీగాళ్లు
వీళ్లు ఎల్‌నినో కంటే యమ డేంజర్‌.. పంటచేలో పచ్చి నకిలీగాళ్లు
హైదరాబాద్ వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కాచిగూడ నుంచి..
హైదరాబాద్ వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కాచిగూడ నుంచి..
నలుపు, తెలుపు, నీలం.. వాటర్ ట్యాంక్ ఏది మంచిదో తెలుసుకోండి..!
నలుపు, తెలుపు, నీలం.. వాటర్ ట్యాంక్ ఏది మంచిదో తెలుసుకోండి..!
బంగారం, వెండి కాదు.. భవిష్యత్తులో దీనిదే హవా..
బంగారం, వెండి కాదు.. భవిష్యత్తులో దీనిదే హవా..
అన్నా ఆల్ ది బెస్ట్.. 'జబర్దస్త్' నుంచి మరో డైరెక్టర్..
అన్నా ఆల్ ది బెస్ట్.. 'జబర్దస్త్' నుంచి మరో డైరెక్టర్..
ఆవు పాలు vs బర్రె పాలు.. పిల్లల ఆరోగ్యానికి ఏది మంచిది?
ఆవు పాలు vs బర్రె పాలు.. పిల్లల ఆరోగ్యానికి ఏది మంచిది?
కాల్చిన లవంగంతో ముఖానికి మెరుపు! మొటిమలు, మచ్చలకు దివ్యౌషధం
కాల్చిన లవంగంతో ముఖానికి మెరుపు! మొటిమలు, మచ్చలకు దివ్యౌషధం
నగరవాసుల నుంచి సైబర్ నేరగాళ్లు గంటకు ఎంత దోచేస్తున్నారు అంటే
నగరవాసుల నుంచి సైబర్ నేరగాళ్లు గంటకు ఎంత దోచేస్తున్నారు అంటే