ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌పై కోటి రూపాయల వాచ్ పుకార్లు సోషల్ మీడియాలో కలకలం రేపాయి. అసెంబ్లీలోనూ చర్చనీయాంశమైన ఈ విషయంపై ఆయన స్పష్టతనిచ్చారు. ఇది రూ.10,000-రూ.40,000 విలువైన మైఖేల్ కోర్స్ వాచ్ అని, మిత్రుడు బహుమతిగా ఇచ్చారని వివరించారు. ప్రతిపక్షాల ట్రోలింగ్‌గా అభివర్ణించిన ఆయన, వాచ్ ధర గురించి అసెంబ్లీలోనే వెల్లడించారు.