Nagarjuna: ఈ సినిమా మంచి మెడిసిన్‌లా పనిచేస్తుంది.. ఓటీటీ టాప్ ట్రెండింగ్ మూవీపై నాగార్జున ప్రశంసలు
లీవుడ్ మన్మథుడు, హీరో అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన వందో సినిమా పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నారు. మైల్ స్టోన్ మూవీ కావడంతో ఈ సినిమా కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అక్కినేని హీరో. ఇదిలా ఉంటే తాజాగా నాగ్ ఓ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

గతేడాది కుబేర, కూలీ సినిమాలతో ఆడియెన్స్ ను పలకరించారు అక్కినేని నాగార్జున. అయితే ఈ రెండూ మల్టీ స్టారర్ సినిమాలే. పైగా వీటిలో నాగార్జున నెగెటివ్ రోల్స్ పోషించడం గమనార్హం. దీంతో నాగ్ ను మళ్లీ సోలో హీరోగా చూడాలని అక్కినేని ఫ్యాన్స్ బాగా కోరుకుంటున్నారు. దీనికి తోడు ఇప్పుడు నాగ్ నటించేది వందో సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగానే ఈ మూవీ కోసం కింగ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తమిళ దర్శకుడు కార్తీక్ తెరకెక్కిస్తోన్న నాగ్ వందో సినిమాలో టబు హీరోయిన్ గా నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో మన్మథుడు బిజీగా ఉంటున్నాడు. అయితే తాజాగా ఈ అక్కినేని హీరో ఓ చిన్న సినిమాపై ప్రశంసలు కురిపించాడు. ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ సినిమాను చూసి సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందానికి అభినందనలు తెలిపాడు.
పవన్ కల్యాణ్’ఓజీ’ హీరోయిన్ ప్రియాంక మోహన్ నటించిన లేటెస్ట్ సినిమా మేడిన్ కొరియా. నాగార్జున వందో సినిమాను తెరకెక్కిస్తోన్న ఆర్. కార్తీక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మార్చి 12న నేరుగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చిన మేడిన్ కొరియా ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో నంబర్‌వన్‌గా ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే హీరో నాగార్జున ఈ సినిమాను చూశారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా చిత్రంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘మేడిన్ కొరియా డైరెక్టర్ ఆర్. కార్తీక్ కు ప్రత్యేక అభినందనలు. నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ఈ మూవీ చాలా ఇన్ స్పైరింగ్ గా ఉంది. నేను బాగా ఆస్వాదించాను. ఒత్తిడిలో ఉన్న సమయంలో ఇలాంటి సినిమా మంచి మెడిసిన్‌గా పనిచేస్తుంది. అలాగే ఈ సినిమాలో అద్భుతంగా నటించిన ప్రియాంక మోహన్ కు ప్రత్యేక అభినందనలు’ అంటూ నాగ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
నాగార్జున ట్వీట్..
Congratulations to my director @Rakarthik_dir for this uplifting film feel good #MadeinKorea on Netflix!! Totally enjoyed it 😊the right medicine for these stressful times💐 special shout out to @priyankaamohan https://t.co/vV5Kqa3Pdq
— Nagarjuna Akkineni (@iamnagarjuna) March 17, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




