AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఏం సినిమారా భయ్.. యూత్ మళ్లీ మళ్లీ చూస్తున్నారు.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో తెలుగు మూవీ

ఈ సినిమాలో హీరో, హీరోయిన్లు కొన్ని కారణాలతో ఒకే గదిలో ఉండాల్సి వస్తోంది. వేర్వేరు లక్ష్యాలతో ఉన్న వీరు అనూహ్యంగా ప్రేమలో పడతారు? కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది? మరి వీరి ప్రేమ ఎక్కడి దాకా వెళ్లింది? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

OTT Movie: ఏం సినిమారా భయ్.. యూత్ మళ్లీ మళ్లీ చూస్తున్నారు.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో తెలుగు మూవీ
OTT Movie
Basha Shek
|

Updated on: Mar 17, 2026 | 9:31 PM

Share

గత వారం ఓటీటీలోకి చాలా కొత్త సినిమాలు వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు, ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. అందులో ఒక తెలుగు సినిమా టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ముఖ్యంగా యూత్ అయితే ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం కానుకగ ఫిబ్రవరి 14న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అందుకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లు రాబట్టింది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 15-20 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. పలువరు స్టార్ హీరోలు కూడా ఈ సినిమాను చూసి చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ సినిమా కథ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకునే అంశాలు ఈ మూవీలో పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమాలో హీరో పేరు శివ. ఒక మంచి ఇంటీరియర్ డిజైనర్ అవ్వాలనే లక్ష్యంతో చెన్నైలో అడుగు పెడతాడు. కానీ జాబ్ దొరక్కపోవడంతో బైక్ టాక్సీ రైడర్‌గా పనిచేస్తుంటాడు. ఇదే సమయంలో హీరోయిన్ కూడా ఐటీ జాబ్ ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేస్తుంటుంది. అలా వేర్వేరు లక్ష్యాలున్న వీరు అనుకోని పరిస్థితుల్లో కలుస్తారు. ఆర్థిక సమస్యలు ఉండడతో తప్పనిసరి పరిస్థితుల్లో ఒకే గదిలో ఉండాల్సి వస్తుంది. మరి వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? తల్లిదండ్రుల నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? చివరకు వీరి ప్రేమ కథ ఏమైంది? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో ఉన్న ఈ యూత్ ఫుల్ ల వ్ ఎంటర్ టైనర్ పేరు కపుల్స్ ఫ్రెండ్లీ. టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్‌ శోభన్‌ ఇందులో పాత్రలో నటించాడు. అలాగే ఫెమినా మిస్ ఇండియా మానస వారణాసి హీరోయిన్ గా చేసింది. యోగి బాబు, రాజీవ్ కనకాల, గోపరాజు రమణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకు ఆదిత్య రవీంద్రన్ సంగీతం సమకూర్చారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

కపుల్ ఫ్రెండ్లీ సినిమాపై ఒక నెటిజన్ రివ్యూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహిళా రైతుపై తోపుడుబండ్ల వ్యాపారుల దాడి..మామిడి పండ్లు రోడ్డుపాలు
మహిళా రైతుపై తోపుడుబండ్ల వ్యాపారుల దాడి..మామిడి పండ్లు రోడ్డుపాలు
కోళ్లగూడు క్లీన్ చేస్తుంటే ఊహించని సీన్.. ఎర్రతేలు వీపుపై ఏముందో
కోళ్లగూడు క్లీన్ చేస్తుంటే ఊహించని సీన్.. ఎర్రతేలు వీపుపై ఏముందో
హార్ట్ షేప్ సరస్సు..ఇంతటి అందం..దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఉందంటే..
హార్ట్ షేప్ సరస్సు..ఇంతటి అందం..దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఉందంటే..
ఇది కరెక్ట్ కాదు సార్.. సీఎం విజయ్ నిర్ణయాన్ని తప్పుబట్టిన విశాల్
ఇది కరెక్ట్ కాదు సార్.. సీఎం విజయ్ నిర్ణయాన్ని తప్పుబట్టిన విశాల్
తెలుగు రాష్ట్రాల్లో భగభగ మండే ఎండలు.. మరో 4 రోజుల పాటు..
తెలుగు రాష్ట్రాల్లో భగభగ మండే ఎండలు.. మరో 4 రోజుల పాటు..
వాస్తు : ఇంటికి దురదృష్టం తెచ్చే మొక్కలు ఇవే.. ఎక్కడ ఉన్నా నష్టమే
వాస్తు : ఇంటికి దురదృష్టం తెచ్చే మొక్కలు ఇవే.. ఎక్కడ ఉన్నా నష్టమే
వైభవ్ సూర్యవంశీకు ఆ బలహీనత.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్..!
వైభవ్ సూర్యవంశీకు ఆ బలహీనత.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్..!
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త
భవిష్యత్‌కు దారి చూపే మహా వేదిక: TV9 & KAB ఎడ్యుకేషన్ ఎక్స్‌పో
భవిష్యత్‌కు దారి చూపే మహా వేదిక: TV9 & KAB ఎడ్యుకేషన్ ఎక్స్‌పో
పెద్ది ట్రైలర్ లాంచ్ ఈవెంట్..
పెద్ది ట్రైలర్ లాంచ్ ఈవెంట్..