AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూనియర్ ఎన్టీఆర్‌కు దగ్గరి బంధువయ్యే ఈ నటుడు గుర్తున్నాడా? పాపం చిన్న వయసులోనే ఎలా చనిపోయాడో తెలుసా?

గ్లోబల్ స్టార్ కు జూనియర్ ఎన్టీఆర్ కు దగ్గరి బంధువయ్యే ఈ నటుడు వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైనా సత్తా చాటాడు. ముఖ్యంగా బుతురాగాలు, అన్వేషిత సీరియల్స్ తో టీవీ ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. అయితే చాలా చిన్న వయసులోనే ఈ లోకం నుంచి వెళ్లిపోయాడీ ట్యాలెంటెడ్ నటుడు

జూనియర్ ఎన్టీఆర్‌కు దగ్గరి బంధువయ్యే ఈ నటుడు గుర్తున్నాడా? పాపం చిన్న వయసులోనే ఎలా చనిపోయాడో తెలుసా?
Senior Actor Raja
Basha Shek
|

Updated on: Mar 16, 2026 | 6:45 PM

Share

రాజా.. ఈ పేరుతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు ఉన్నారు. ‘ఆనంద్’ సినిమా హీరో రాజా ఇప్పటితరానికి బాగా పరిచయం ఉన్న నటుడే. అయితే198-90ల్లో రాజా పేరుతోనే ఒక ప్రముఖ నటుడు ఉంటాడు. పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ.. పై ఫొటో చూస్తే చాలా మంది ఇట్టే గుర్తు పడతారు. చూడ్డానికి ఆరడుగుల ఎత్తు, మంచి రంగుతో అప్పట్లో హ్యాండ్సమ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు రాజా. 1980లో స్వప్న అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారీ నటుడు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కూడా హీరోగా పలు సినిమాలు చేశారు. కానీ సక్సెస్ కంటిన్యూ చేయలేకపోయాడు. దీంతో క్రమంగా ఇతర హీరోల సినిమాల్లో సహాయక నటుడి, విలన్ పాత్రలు పోషించారు. కానీ ఎందుకో క్రేజ్ తెచ్చుకోలేకపోయారు. దీనికి తోడు అప్పటికే కొత్త హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడంతో క్రమంగా రాజాకు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో మెల్లిగా బుల్లితెర వైపు అడుగులు వేశారు.

దూరదర్శన్‌లో ప్రసారమైన ‘ఋతురాగాలు’ అనే సీరియల్‌లో రాజా ప్రధాన పాత్రలో నటించారు. ప్రముఖ దర్శకురాలు మంజుల నాయుడు తెరకెక్కించిన ఈ ధారావాహిక అప్పట్లో బాగా విజయవంతమైంది. నటుడు రాజాకు కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. దీని తర్వాత ప్రియసఖి, అన్వేషిత తదితర సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి మెప్పించారు రాజా. తన నటనతో బుల్లితెర ఆడియెన్స్ కు ఫేవరెట్ గా మారిపోయాడు. ఇలా ఓ వైపు సినిమాలు, మరోవైపు సీరియల్స్ లో నటిస్తోన్న సమయంలోనే రాజా జీవితంలో విషాదం చోటు చేసుకుంది. ఓ సినిమాలో నటిస్తుండగానే ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఇది సినీ పరిశ్రమతో పాటు అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. రాజా మరణంతో ఒక సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి ఆయన ఒక సినిమాలో నటించాల్సి ఉంది. అయితే రాజా అకాల మరణంతో ఆ ప్రాజెక్ట్ పూర్తిగా పక్కకు వెళ్లిపోయింది.

ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే.. గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి, రాజాకు దగ్గరి బంధుత్వం ఉందట. జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని సోదరిని రాజా వివాహం చేసుకున్నారట. అంటే రాజా జూనియర్ ఎన్టీఆర్‌కు బాబాయ్ వరుస అవుతారన్న మాట. కాగా రాజా చనిపోయిన ఆయన సినిమాలు, సీరియల్స్ రూపంలో ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచే ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పేద విద్యార్ధులు యేటా రూ.48 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
పేద విద్యార్ధులు యేటా రూ.48 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో