24 క్యారెట్స్ క్యాపిటల్.. అందరి అమరావతి.. అందమైన అమరావతి..
అమరావతి 2.0లో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. 21.77 కిలోమీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్, ఎమ్మెల్యేలు-ఎమ్మెల్సీల భారీ నివాస సముదాయం ప్రారంభానికి సిద్ధమయ్యాయి. రోడ్లు, వంతెనలు, ప్రభుత్వ భవనాలు, నివాస సముదాయాలు, ఐటీ, టూరిజం ప్రాజెక్టులతో అమరావతి నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. ప్రపంచస్థాయి మౌలిక వసతులతో అమరావతిని ఆధునిక రాజధానిగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి.

రేపటి వికాసం కోసం స్వర్ణాంధ్ర దిశగా మరో అడుగు అంటూ గత మేనెలలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కృతమైంది అమరావతి 2.O. దాదాపు 58వేల కోట్ల రూపాయల విలువైన పనులకు ఒకేసారి శంకుస్థాపన చేశారు. దాంతోనే అమరావతి కొత్త ఊపిరి పోసుకుంది. పోగొట్టుకున్న బ్రాండ్ ఇమేజ్‌ను కూడా తిరిగి సొంతం చేసుకుంది. దేశమంతా మరోసారి అమరావతి గురించి మాట్లాడుకోవడం మొదలైంది. అన్ని అడ్డంకుల్నీ దాటుకుని, అమరావతి పునఃనిర్మాణాన్ని పట్టాలెక్కించడాన్ని ఛాలెంజ్‌గా తీసుకుంది కూటమి ప్రభుత్వం. ప్రతీరోజూ 20 వేలమంది కార్మికులు, వందల మంది ఇంజినీర్లు, మెటీరియల్ లోడ్‌తో వందలకొద్దీ లారీలు, రాజధానిలో జాతరలా మొదలైంది నిర్మాణం. అడపాదడపా వానలొచ్చి, నీళ్లు నిలబడ్డప్పుడు తప్పిస్తే, మిగతా అన్ని రోజుల్లోనూ నాన్‌స్టాప్‌గా ఒక మహా యజ్ఞంలా సాగింది అమరావతి నిర్మాణం. ఏడాది పాటు జరిగిన రాజధాని యాగం ఒక స్పష్టమైన ఫలితాన్నైతే ఇచ్చింది. అమరావతి 2.O ఫస్ట్ చాప్టర్, మరికొన్నిగంటల్లో చాలా గ్రాండ్‌గా ఆవిష్కృతం కాబోతోంది. సీఆర్డీఏ హెడ్‌క్వార్టర్స్… అల్ట్రా మోడ్రన్ హంగులతో, కార్పొరేట్ తరహాలో 7 అంతస్తుల్లో రూపొందిన అద్భుతమైన నిర్మాణం… గత అక్టోబర్‌లో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభమైంది. అమరావతి 2.Oలో అందుబాటులోకొచ్చిన మొట్టమొదటి పూర్తిస్థాయి భవనం ఇదే. ఇప్పుడు రెండో అడుగు.. అంతకంటే గ్రాండ్‌గా. NH-16తో అనుసంధానిస్తూ 21.77 కిలోమీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్ మరికొన్నిగంటల్లో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ప్రజాప్రతినిధుల కోసం నిర్మించిన భారీ నివాస సముదాయం కూడా ప్రభుత్వానికి...
