AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 10 Telugu : ఛీ ఛీ.. సుధీర్ తో సృష్టి చెత్త ప్రవర్తన.. ఫ్రెండ్స్ మధ్య చిచ్చు పెట్టిన శకుని.. చేతులెత్తి మొక్కిన సుధీర్..

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా ఒక్కో రోజు ఎపిసోడ్ లో జరిగే గొడవలు కొందరికి పాజిటివ్ అవుతాయి.. మరికొందరిని అట్టడుగున పడేస్తాయి. ఇప్పుడు సుధీర్ విషయంలోనూ అదే జరిగింది. ఒకే ఒక్క ఇష్యూతో ఏకంగా విన్నర్ రేసులోకి దూసుకోచ్చాడు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో అతడికి సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Bigg Boss 10 Telugu : ఛీ ఛీ.. సుధీర్ తో సృష్టి చెత్త ప్రవర్తన.. ఫ్రెండ్స్ మధ్య చిచ్చు పెట్టిన శకుని.. చేతులెత్తి మొక్కిన సుధీర్..
Bigg Boss 10 Telugu September 22nd Episode Highlights
Rajitha Chanti
|

Updated on: Sep 23, 2026 | 6:54 AM

Share

బిగ్ బాస్ సీజన్ 10లో మూడో వారం నామినేషన్స్ ప్రక్రియ రసవత్తరంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నిన్నటి సెప్టెంబర్ 22 నాటి ఎపిసోడ్‌లో హౌస్‌లో సృష్టి, సుధీర్ గొడవ హైలెట్ అయ్యింది. వీరిద్దరి గొడవపైనే ఇంట్లో రచ్చ కొనసాగింది. సుధీర్ ను కొడతా, పళ్లు రాలిపోతాయ్ అని ఇష్టమొచ్చినట్లు తిట్టినందుకు ఆమెను నామినేట్ చేయాలని నరేష్ కు చెప్పాడు రామ్ ప్రసాద్. దానికి సరే అన్నాడు నరేష్. అసలు కనిపించడం లేదు అని నాగార్జున సర్ చెప్పడంతో కావాలని ఇంత రచ్చ చేసి సీన్ క్రియేట్ చేయాలా.. ? సృష్టి చేసింది తప్పు అని మాట్లాడాడు రామ్ ప్రసాద్. ఇక నామినేట్ చేసే ఛాన్స్ వస్తే ఎవరికి వచ్చినా కూడా సుధీర్ కు ఇవ్వాలని దేబ్జానీ, నరేష్ లకు చెప్పాడు రామ్ ప్రసాద్. ఇక రోహిత్ సృష్టి దగ్గర కూర్చున ఫ్రీడమ్ వచ్చిందని డ్యాన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు ఎవరి వెనుక పడ్డారో అందరికి తెలుసు అంటూ ఆమెకు భజన చేస్తూ కూర్చున్నాడు. ఇక ఎప్పటిలాగే త్రిగుణ్ దగ్గర కూర్చున్న సృష్టి మరోసారి సుధీర్ గురించి చెప్పడం స్టార్ట్ చేసింది. నన్ను కొన్ని చోట్ల వాడుకున్నాడు అనిపిస్తుంది. అసలు జీవితంలో అంత కోపం తెచ్చుకోలేదు అంటూ తెగ ఏడ్చేసింది సృష్టి.. ఇంకేముంది కావాలని మరింత రెచ్చగొట్టాడు త్రిగుణ్.

అతనివన్నీ శకుని మూవ్స్, ఏ అడుగు వేసినా కూడా శకునే అంటూ త్రిగుణ్ గురించి ముకేష్ తో చెప్పుకొచ్చాడు రోహిత్. త్రిగుణ్ ఒక్కోసారి ఒక్కోక్కర్ని అస్త్రంగా వాడతాడు. ఇప్పుడు సృష్టిని ఆపరేట్ చేస్తున్నాడు. అందుకే తన ప్రవర్తన మారిపోయింది. ఆమమెను రెచ్చగొట్టేస్తున్నాడు అంటాడు ముకేష్. మొన్నటి వరకు వంశీని ఎలా ఆపరేట్ చేశాడో.. ఇప్పుడు సృష్టిని ఆపరేట్ చేస్తున్నాడు. డైరెక్టుగా ఆడడు. వెనుక ఉండి ఆడతాడు అన్నాడు రోహిత్. ఇక నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ కాగా చరణ్ ను నామినేట్ చేశాడు ముకేష్. తర్వాత షాలినికి నామినేట్ చేసే పవర్ రాగా.. ఏమాత్రం ఆలోచన లేకుండా వెంటనే వర్షిణిని నామినేట్ చేసింది.

ఇక తర్వాత రెండో నామినేషన్ చేసే ఛాన్స్ సృష్టికి ఇచ్చింది షాలిని. ఇక అందరూ ఊహించినట్లే సుధీర్ ను నామినేట్ చేసింది సృష్టి. నీ అవసరం కోసం వేరే వాళ్లను యూజ్ చేయొద్దు అంటూ స్టార్ట్ చేసింది. నాతో ఉన్నావ్.. నాతో తిరిగావ్. చివరకు విసిరికొట్టావ్. అసలు నీపై నాకు ఇంట్రెస్ట్ లేదు అంటూ తెగ రచ్చ చేసింది సృష్టి. నేనెప్పుడు నీతో రాంగ్ గా మాట్లాడలేదు అని సుధీర్ అనడంతో మరి ఫ్రీడమ్ అని ఎందుకు అన్నావ్ అంటూ రెచ్చిపోయింది సృష్టి. దీంతో సుధీర్ మమాట్లాడుతూ.. కేవలం 14 రోజుల జర్నీలో నా పళ్లు రాలగొడతా అన్నావ్. ఇడియట్ అన్నావ్. మొహంపై వేలు పెట్టి మాట్లాడావ్. ప్రతిసారి నేనే వచ్చ మాట్లాడా అని అంటున్నావ్. మరి నువ్వెందుకు రెస్పాండ్ అయ్యావ్. నా జీవితంలో ఏ అమ్మాయితో ఇన్ని మాటలు పడలేదు. నాకు బుద్ది తక్కువై ఆమెతో క్లోజ్ గా ఉన్నాను. ఫ్రీడమ్ నే మాటను పెద్ద బూతులు చూస్తున్నారు. ఫ్రీడమ్ అంటే నా గేమ్ పై ఫోకస్ పెడతా అనే ఉద్దేశ్యం అంటూ చెబుతూ చేతులెత్తి దండం పెట్టేశాడు సుధీర్. ఇక మధ్యలోకి త్రిగుణ్ దూరగా.. సుధీర్ పై మరింత రెచ్చిపోయింది సృష్టి. చివరగా సుధీర్ పై చెత్తను కుమ్మరిస్తూ పిచ్చెక్కినట్లు ప్రవర్తించింది సృష్టి. చివర్లో చెత్తను అతడి మొహంపై విసిరికొట్టింది. కానీ సుధీర్ ఆమె ఏం చేసినా ఓపిగ్గా ఉన్నాడు. దీంతో ఈ ఒక్క ఎపిసోడ్ తో సృష్టి, త్రిగుణ్ పాతాళానికి పడిపోగా.. విన్నర్ రేసులోకి దూసుకొచ్చాడు సుధీర్.

Follow Us