కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తున్న  అందాల తమన్నా 

22 September  2026

Rajeev 

Pic credit - Instagram

దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్లలో తమన్నా భాటియా ఒకరు.

అందం, అభినయం, డ్యాన్స్‌తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకులను అలరిస్తూ రెండు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణాన్ని కొనసాగుతుంది.

ఇప్పటికీ వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ప్రత్యేక పాటలతో కెరీర్‌లో బిజీగా ఉన్నారు. 2005లో ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ అనే హిందీ చిత్రంతో నటిగా పరిచయం అయ్యారు.

అదే ఏడాది ‘శ్రీ’ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 2006లో ‘కేడీ’ సినిమాతో తమిళ ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

 హ్యాపీ డేస్ తో తమన్నా హిట్ అందుకుంది. తర్వాత కోంచెం ఇష్టం కోంచెం కష్టం, 100 లవ్, తడాఖా తదితర సినిమాలతో దూసుకుపోయింది.

తమన్నా కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రం బాహుబలి: ది బిగినింగ్. తర్వాత బాహుబలి: ది కన్‌క్లూజన్ లోనూ ఆమె కీలక పాత్రలో కనిపించారు.

2026లోనూ తమన్నా చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. ఓ రోమియో, ది వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్, రాగిణి 3 వంటి ప్రాజెక్టులతో ఆమె ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.