AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: 9 కోట్లతో తీస్తే 60 కోట్లకు పైగా కలెక్షన్లు.. థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ

ఈ ఏడాది సంచలన విజయం సాధించిన సినిమాల్లో ఇది ఒకటి. కేవలం రూ. 9 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ. 60 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు 10 కి 8.1 రేటింగ్ దక్కడం గమనార్హం.

OTT Movie: 9 కోట్లతో తీస్తే 60 కోట్లకు పైగా కలెక్షన్లు.. థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ
OTT Movie
Basha Shek
|

Updated on: Mar 15, 2026 | 11:28 AM

Share

సాధారణంగా ఒక సినిమా కమర్షియల్ గా విజయం సాధించాలంటే అందులో స్టార్ హీరోలు, హీరోయిన్స్ ఉండాలి. అలాగే భారీ యాక్షన్ సీక్వెన్సులు, వీఎఫ్ ఎక్స్ హంగులు, స్పెషల్ సాంగులు ఉండాల్సిందే. అయితే ఈ సినిమాలో ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవీ లేవు. పైగా ఇది లో బడ్జెట్ మూవీ. కానీ ఆడియెన్స్ ను ఆకట్టుకునే కంటెంట్ ఉంది. అందుకే చిన్న సినిమానే అయినా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ట్రేడ్ నిపుణులను ఆశ్చర్యపరుస్తూ రికార్డు కలెక్షన్లు రాబట్టింది. కేవలం రూ. 9 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఓవరాల్ గా రూ. 60 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. గత నెల ఫిబ్రవరి 27న థియేటర్లలో ఈ మూవీకి ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తుండడం గమనార్హం. ఈ సినిమా కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే ఐఎమ్ డీబీలోనూ ఈ మూవీకి 10 కి 8.1 రేటింగ్ దక్కడం విశేషం. ఈ సినిమా కథ అంతా పావునుతాయ్అనే 70 ఏళ్ల వృద్ధురాలి చుట్టూ తిరుగుతుంది. ఊరిలో ఆమె ఒక కరుడు గట్టిన వడ్డీ వ్యాపారి. నోటిదురుసు, మొండితనం ఉన్న ఆమె తన ముగ్గురు కొడుకులను కూడా తన అదుపులోనే ఉంచుకుంటుంది. అలాంటి ఆమె సడెన్ గా పక్షవాతం వచ్చి మంచాన పడుతుంది. దీంతో ఊరి జనమంతా ఆమె ఎప్పుడు చనిపోతుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మరోవైపు ఆమె కొడుకులు కూడా ఆస్తి ఎక్కడ ఉందో కనుగొనేందుకు ప్రయత్నిస్తుంటారు.

కనీసం కదల్లేని, మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలు ఏదో సైగ చేస్తూ ఒక రహస్యం చెప్పాలని ప్రయత్నిస్తుంటుంది. అదే సమయంలో ఒక వ్యక్తి వృద్ధురాలి దగ్గరకు వచ్చి 160 తులాల బంగారం గురించి అడుగుతాడు. అంతే అందరూ షాక్ అవుతారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఆ వృద్ధురాలి చెప్పాలనుకున్న రహస్యం ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఆద్యంతం నవ్వులు పూయిస్తూనే కన్నీళ్లు పెట్టించే ఈ ఎమోషనల్ మూవీ పేరు ‘తాయి కిళవి’. సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రానుంది. మార్చి 26 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో రాధిక సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానున్నట్లు తెలుస్తోంది.

థియేటర్లలో రాధిక సినిమాకు రెస్పాన్స్ ఇదే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us