AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Season 10: బిగ్ సర్‌ప్రైజ్‌.. బిగ్ బాస్‌ ఆ రోజు నుంచి మొదలు..

Bigg Boss Season 10: బిగ్ సర్‌ప్రైజ్‌.. బిగ్ బాస్‌ ఆ రోజు నుంచి మొదలు..

Phani CH
|

Updated on: Aug 09, 2026 | 5:05 PM

Share

బిగ్ బాస్ తెలుగు పదో సీజన్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సామాన్యుల ఎంపిక కోసం ‘అగ్ని పరీక్ష’ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ షో ఆగస్టు 15 నుంచి ప్రసారం కానుండగా, బిగ్ బాస్ 10 సెప్టెంబర్ 6న ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. నాగార్జునే మరోసారి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. దాదాపు 15 వారాల పాటు సాగే ఈ సీజన్‌లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా కంటెస్టెంట్లుగా కనిపించనున్నారు. Star Maa, JioHotstarలో ప్రసారం కానుంది.

తెలుగులో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్న రియాల్టీ షోలలో బిగ్ బాస్ ఒకటి. తెలుగులో తొమ్మిది సీజన్స్ ని పూర్తి చేసుకొని ఇప్పుడు పదో సీజన్ కి రెడీ అయింది. ఇప్పటికే సామాన్యులను బిగ్ బాస్ కి తీసుకెళ్లే అగ్నిపరీక్ష కు ఆడిషన్స్ తీసుకొని అందులో పాల్గొనే వాళ్లకు ఫైనల్ పరీక్ష కూడా రెడీ అయింది. బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష ఆగస్టు 15 నుంచి స్టార్ మా ఛానల్ లో, జియో హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. దాదాపు 15 రోజుల పాటు బిగ్ బాస్ అగ్ని పరీక్ష సాగనుంది. దీంతో బిగ్ బాస్ ఫాలోవర్స్ అగ్ని పరీక్ష షో కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ షో టెలికాస్ట్ డేట్ లేక్ అయింది. టాలీవుడ్ సమాచారం ప్రకారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ 6 ఆదివారం నుంచి టెలికాస్ట్ మొదలవ్వనున్నట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ 6 ఆదివారం నాడు కంటెస్టెంట్స్ ని గ్రాండ్ గా హౌస్ లోకి పంపి సెప్టెంబర్ 7 నుంచి అసలైన అట మొదలు కానుంది. దాదాపు 15 వారాల పాటు ఈ షో సాగనుంది. స్టార్ మా ఛానల్ లో ప్రతిరోజు రాత్రి 9.30 గంటలకు, శని, ఆది వారాలు రాత్రి 9 గంటలకు బిగ్ బాస్ టెలికాస్ట్ అవ్వనుంది. జియో హాట్ స్టార్ ఓటీటీలో కూడా ఈ షో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈసారి కూడా నాగార్జునే బిగ్ బాస్ ని హోస్ట్ చేయబోతున్నారు. మరి ఈసారి బిగ్ బాస్ లోకి వచ్చే సెలబ్రిటీలు, సామాన్యులు ఎవరో చూడాలంటే ఇంకో నెల రోజులు ఎదురు చూడాల్సిందే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డ్యూటీకి డుమ్మా కొట్టి.. ప్రైవేటు డాక్టర్‌ని పెట్టి.. బైటపడ్డ ప్రభుత్వ డాక్టర్ బాగోతం..!

ట్రాక్‌పై దూసుకెళ్తున్న రైలు.. ఒక్కసారిగా ఊడిపోయిన చక్రాలు

యూపీఐ ఛార్జీలపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

రిటైరైనా తగ్గని క్రేజ్.. బ్రాండ్ రేసులో దూసుకెళ్తున్న మాస్టర్‌ బ్లాస్టర్‌

తన తండ్రి ఎలా మరణించారో వివరిస్తూ.. బోరున ఏడ్చిన కొడుకు

Follow Us