AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తన తండ్రి ఎలా మరణించారో వివరిస్తూ.. బోరున ఏడ్చిన కొడుకు

తన తండ్రి ఎలా మరణించారో వివరిస్తూ.. బోరున ఏడ్చిన కొడుకు

Phani CH
|

Updated on: Aug 09, 2026 | 4:56 PM

Share

తెలుగు సినిమాల్లో విలన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రదీప్ రావత్ ఆగస్టు 6న కన్నుమూశారు. క్యాన్సర్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయనకు అరుదైన రకం బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అంత్యక్రియల అనంతరం కుమారుడు విక్రమాదిత్య తండ్రి చివరి రోజుల గురించి కన్నీటిపర్యంతమయ్యాడు. రెండు నెలల క్రితమే పరీక్షలు చేయించినా రిపోర్టులు సాధారణంగా వచ్చాయని, కేవలం నెలన్నరలోనే పరిస్థితి విషమించిందని చెప్పాడు. ఐసీయూలో తండ్రి చివరి క్షణాలను గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.

సై, ఛత్రపతి వంటి ఎన్నో సూపర్ హిట్ తెలుగు సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించిన ప్రదీప్ రావత్ అకాల మరణం అందరినీ కలిచివేసింది. క్యాన్సర్ తో బాధపడుతోన్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 06న కన్నుమూశారు. ఆగస్టు 07 ప్రదీప్ రావత్ అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యులతో పాటు ప్రదీప్ రావత్ స్నేహితులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు నటుడి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ప్రదీప్ రావత్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. ఇక అంత్యక్రియల అనంతరం ప్రదీప్ రావత్ కుమారుడు విక్రమాదిత్య మీడియాతో మాట్లాడాడు. తన తండ్రి చివరి రోజుల గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు. నాన్నకు మొదట కడుపులో సాధారణ ఇన్ఫెక్షన్‌ వచ్చిందేమో అనుకున్నామని.. అయినా కానీ నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల దగ్గరకు తీసుకెళ్లామని.. కానీ చాలా మందులు ఇచ్చినా అవేమీ పనిచేయలేదంటూ ప్రదీప్ కొడుకు ఎమోషనల్ అయ్యాడు. నాన్న ఆరోగ్యం బాగా క్షీణించిందని అమ్మ ఒకరోజు ఫోన్‌ చేసిందిని.. మళ్లీ మెడికల్ టెస్టులు చేయించగా.. తెల్ల రక్త కణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని తేలిందంటూ చెప్పాడు. ఆ వెంటనే నాన్నను కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించాం. అప్పుడే బ్లడ్‌ క్యాన్సర్‌ అని డాక్టర్లు నిర్ధారించారు. అది వినగానే తాము కుప్పకూలిపోయాం అంటూ బోరున ఏడ్చాడు విక్రమాదిత్య. ప్రదీప్ రావత్‌కు వచ్చింది.. ఒక అరుదైన రకం క్యాన్సర్. వేగంగా శరీరమంతా విస్తరిస్తుంది. దీంతో తాము నిర్లక్ష్యం చేయకుండా రెండు నెలల క్రితమే తన నాన్నకు అన్ని పరీక్షలూ చేయించామని విక్రమాదిత్య చెప్పాడు. రిపోర్ట్‌లన్నీ సాధారణంగానే ఉన్నాయని.. కానీ నెలన్నర వ్యవధిలోనే అంతా అయిపోయింది.. నాన్న తమను వదిలివెళ్లిపోయారంటూ విక్రమాదిత్య ఎమోషనల్ అయ్యాడు. ఇక ఐసీయూలో ప్రదీప్‌ రావత్‌ చివరి క్షణాలను గుర్తుచేసుకున్న విక్రమాదిత్య కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘ఉన్నట్లుండి వైద్యులు మమ్మల్ని పిలవడంతో ఐసీయూ వైపు పరిగెత్తాం. అప్పుడు వైద్యులు నాన్నకి సీపీఆర్ చేస్తున్నారు. అది చూడగానే మాకు అర్థమై పోయింది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలిసింది. అవే నాన్న ఆఖరి క్షణాలని, ఆశలు లేవని నాకు అర్థమైంది. ఆ క్షణంలో అమ్మ గుండె పగిలేలా ఏడ్చింది. చూస్తుండగానే అంతా అయిపోయింది’ అని వాపోయాడు విక్రమాదిత్య.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Arjun: బన్నీని కలవాలని ప్లాన్ చేస్తున్నారా? అప్‌డేట్ తెలుసుకోవాల్సిందే

Follow Us