కేంద్ర ప్రభుత్వం జనన మరణ ధృవీకరణ పత్రాల జారీకి కొత్త నిబంధనలను అక్టోబర్ 1, 2023 నుండి అమలులోకి తెచ్చింది. ఇకపై, 21 రోజులలోపు సర్టిఫికెట్లు పొందకపోతే ఆలస్యం ఆధారంగా జరిమానాలు, జిల్లా మేజిస్ట్రేట్ లేదా కోర్టు అనుమతులు తప్పనిసరి అవుతాయి. రెండేళ్లకు మించి ఆలస్యమైతే కోర్టు జోక్యం అవసరం.