ట్రాక్‌పై దూసుకెళ్తున్న రైలు.. ఒక్కసారిగా ఊడిపోయిన చక్రాలు
శ్రీకాకుళం జిల్లా మందస రోడ్ సమీపంలో పెను రైలు ప్రమాదం తప్పింది. ఒడిశా నుంచి విశాఖపట్నం వెళ్తున్న గూడ్స్ రైలు కదులుతుండగా ఓ బోగీకి చెందిన రెండు చక్రాలు ఒక్కసారిగా ఊడిపోయి పట్టాలపై నుంచి బయటకు వచ్చాయి. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టి సాంకేతిక బృందాలతో మరమ్మతులు పూర్తి చేశారు. ఘటనతో కొంతసేపు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి, పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ప్రమాదానికి కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇప్పటి వరకూ కదులుతున్న బస్సు చక్రాలు ఊడిపోయిన ఘటనలు చూశాం. తాజాగా ఈ లిస్ట్‌లోకి రైలు కూడా చేరింది. మీరు విన్నది నిజమే. ట్రాక్‌పై దూసుకెళ్తున్న రైలు చక్కాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. శ్రీకాకుళం జిల్లా మందస రోడ్ సమీపంలో రైల్వే ట్రాక్ పై పెను ప్రమాదం తప్పింది. ఒడిశా నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న గూడ్స్ రైలు బోగీ చక్రాలు రెండు జాయింట్ గా ఊడిపోయాయి.రైలు కదులుతుండగానే ఈ ఘటన జరగటంతో ఊడిపోయిన చక్రాలు రెండు పట్టాలపై నుంచి బయటకు వచ్చేసాయి. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న అధికారులు, సాంకేతిక బృందాలు యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటన కారణంగా రైల్వే మార్గంలో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.ప్రమాదానికి గల కారణాలపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సమయానికి సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యూపీఐ ఛార్జీలపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
రిటైరైనా తగ్గని క్రేజ్.. బ్రాండ్ రేసులో దూసుకెళ్తున్న మాస్టర్ బ్లాస్టర్
తన తండ్రి ఎలా మరణించారో వివరిస్తూ.. బోరున ఏడ్చిన కొడుకు
Allu Arjun: బన్నీని కలవాలని ప్లాన్ చేస్తున్నారా? అప్‌డేట్ తెలుసుకోవాల్సిందే
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..

