AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్యూటీకి డుమ్మా కొట్టి.. ప్రైవేటు డాక్టర్‌ని పెట్టి.. బైటపడ్డ ప్రభుత్వ డాక్టర్ బాగోతం..!

డ్యూటీకి డుమ్మా కొట్టి.. ప్రైవేటు డాక్టర్‌ని పెట్టి.. బైటపడ్డ ప్రభుత్వ డాక్టర్ బాగోతం..!

Phani CH
|

Updated on: Aug 09, 2026 | 5:03 PM

Share

సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో విధులకు గైర్హాజరవుతూ, తన స్థానంలో ప్రైవేట్ డెంటల్ డాక్టర్‌ను డ్యూటీకి పంపిన వైద్యాధికారి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రైవేట్ వైద్యుడు ప్రభుత్వ డాక్టర్‌గా రోగులను పరీక్షించి మందులు రాసినట్లు విచారణలో తేలింది. ఘటనపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేసి, డాక్టర్ కె. రమేష్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. క్రిమినల్ కేసులతో పాటు బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు ఓ వైద్యాధికారి. తన స్థానంలో ఒక ప్రైవేట్ డాక్టర్‌ను డ్యూటీకి పంపి, త సొంత ఆస్పత్రిలో డ్యూటీ చేసుకుంటున్నాడు. సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్ సివిల్ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ కె. రమేష్, రోజూ విధులకు డుమ్మా కొడుతూ తన సొంత ఆస్పత్రి నిర్వహణలో మునిగిపోయిన బాగోతం బట్టబయలైంది. తన విధులకు హాజరుకాకుండా, తన స్థానంలో రవి అనే ప్రైవేట్ డెంటల్ డాక్టర్‌ను డ్యూటీలో పెట్టాడు. సదరు ప్రైవేట్ డాక్టర్ అసలైన ప్రభుత్వ వైద్యుడిలా చెలామణి అవుతూ రోగులకు పరీక్షలు చేస్తూ, మందులు రాస్తుండటం అధికారుల విచారణలో నిరూపితమైంది. ఈ ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల ప్రాణాలతో ఆడుకునే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ డాక్టర్ రమేష్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు, ఆస్పత్రిలో ఈ దారుణం జరుగుతున్నా పట్టించుకోని సూపరింటెండెంట్‌పై కూడా శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని హెల్త్ సెక్రటరీని ఆదేశించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రాక్‌పై దూసుకెళ్తున్న రైలు.. ఒక్కసారిగా ఊడిపోయిన చక్రాలు

యూపీఐ ఛార్జీలపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

రిటైరైనా తగ్గని క్రేజ్.. బ్రాండ్ రేసులో దూసుకెళ్తున్న మాస్టర్‌ బ్లాస్టర్‌

తన తండ్రి ఎలా మరణించారో వివరిస్తూ.. బోరున ఏడ్చిన కొడుకు

Allu Arjun: బన్నీని కలవాలని ప్లాన్ చేస్తున్నారా? అప్‌డేట్ తెలుసుకోవాల్సిందే

Follow Us