ముంబైలోని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భద్రతా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గణేష్ అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందారు. డ్యూటీలో ఉండగా గుండెపోటుతో ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. లారెన్స్ బిష్ణోయ్ బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్ ఖాన్కు భద్రత పెంచిన క్రమంలో గణేష్ అక్కడ విధులు నిర్వహిస్తున్నారు.