Jana Nayagan: ఏ సర్టిఫికెట్.. 7 నెలల ఆలస్యం.. పైరసీ లీక్.. అయినా రూ.300 కోట్లు కొల్లగొట్టిన విజయ్!
దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ ఎన్నో అడ్డంకులను అధిగమించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. సినిమా ఏడు నెలలు ఆలస్యంగా విడుదల కావడంతో పాటు, హింసాత్మక సన్నివేశాల కారణంగా ఏ సర్టిఫికెట్, విడుదలకు ముందే ఆన్‌లైన్ లీక్ వంటి సమస్యలు ఎదురయ్యాయి. అయినప్పటికీ విజయ్ క్రేజ్ ముందు అవన్నీ ప్రభావం చూపలేదు. థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణతో సినిమా ఏకంగా రూ.300 కోట్ల క్లబ్‌లోకి చేరి సంచలనం సృష్టించింది.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా దళపతి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేస్తోంది ఆయన రీసెంట్ మూవీ జన నాయగన్. ఎన్నో కష్టాలను దాటుకుని బరిలో దిగిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. విజయ్ మార్కెట్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసిన ఈ సినిమాకు ఎదురైన సమస్యలేంటి..? వాటిని దాటి జన నాగయన్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏంటి..? ఈ స్టోరీలో చూద్దాం. దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన జన నాయగన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఏకంగా 300 కోట్ల క్లబ్‌లో చేరి ఇండస్ట్రీ జనాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఒక పక్క విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పేసినా… హీరోగా ఆయన క్రేజ్, బాక్సాఫీస్ స్టామినా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసింది ఈ మూవీ. నిజానికి ఈ సినిమా థియేటర్ల వరకు రావడం అంత ఈజీగా జరగలేదు. అనుకున్న టైమ్ కంటే దాదాపు 7 నెలలు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పైగా ఈ సినిమాలోని వయోలెన్స్ కారణంగా సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడం కష్టమే అని అంతా అనుకున్నారు. అదే సమయంలో విజయ్ ఫ్యాన్స్‌లో మేజర్ సెక్షన్ అయిన 18 బిలో యూత్ సినిమా చూసే ఛాన్స్ లేకుండా పోయింది. కానీ విజయ్ క్రేజ్ ముందు ఆ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. రిలీజ్‌కు ముందే సినిమా మొత్తం ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం ఇండస్ట్రీని షేక్ చేసింది. పైరసీ దెబ్బకు కచ్చితంగా కలెక్షన్స్ గల్లంతవ్వడం ఖాయం అని భావించారు. కానీ ఆన్‌లైన్‌లో లీకైన సినిమాను పక్కనపెట్టి, థియేటర్లలోనే తమ అభిమాన హీరోను చూసేందుకు ఫ్యాన్స్ క్యూ కట్టారు. ఇన్ని నెగెటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నా.. ఏకంగా 300 కోట్లు కొల్లగొట్టడం అంటే మామూలు విషయం కాదంటున్నారు ఇండస్ట్రీ జనాలు. కంటెంట్‌లో దమ్ముంటే, దానికి హీరో క్రేజ్ తోడైతే ఎలాంటి అడ్డంకులైనా దాటొచ్చని జన నాయగన్ మరోసారి ప్రూవ్ చేసిందంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Varanasi: వారణాసి లీక్స్ రచ్చ.. రాజమౌళి ధమాకా ప్లాన్ మెప్పించేనా?
పాడైన నోట్లను మార్చడానికి బ్యాంకు నిరాకరిస్తోందా? మీరు కంప్లైంట్ చేయొచ్చు తెలుసా!
Bigg Boss Season 10: బిగ్ సర్‌ప్రైజ్.. బిగ్ బాస్ ఆ రోజు నుంచి మొదలు..
డ్యూటీకి డుమ్మా కొట్టి.. ప్రైవేటు డాక్టర్‌ని పెట్టి.. బైటపడ్డ ప్రభుత్వ డాక్టర్ బాగోతం..!
ట్రాక్‌పై దూసుకెళ్తున్న రైలు.. ఒక్కసారిగా ఊడిపోయిన చక్రాలు
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు
తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. తర్వాత ఏం చేసారంటే
తల్లి గర్భంలోనే సర్జరీ.. వైద్య చరిత్రలోనే అరుదైన అద్భుతం!
కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా..
చదువుకుంటాను.. స్కూల్లో కొత్త అతిథిని చూసి హడలిపోయిన విద్యార్ధులు
150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగి వచ్చిన పుస్తకం.. కట్ చేస్తే..

