అంబేద్కర్ కోనసీమ జిల్లా, అప్పనరామునిలంక గ్రామంలో ఓ బాడిత చెట్టు నుంచి గత నాలుగు రోజులుగా వర్షంలా నీటిచుక్కలు కురుస్తున్నాయి. ఇది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పిన మహిమేనని గ్రామస్తులు భావిస్తున్నారు. ఈ వింత దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. స్థానికులు చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.