జెన్ జీ గృహ యాజమాన్యం పట్ల వినూత్న వైఖరిని ప్రదర్శిస్తోంది. రుణ భారం, ఈఎంఐల గొడవలు వద్దని, అద్దె గృహాల్లో నివసిస్తూ పొదుపు చేసిన డబ్బుతో ప్రయాణాలకు, పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తోంది. ఈ ధోరణి దేశ రియల్ ఎస్టేట్ రంగానికి, ఆర్థిక వృద్ధి అంచనాలకు సవాళ్లు విసురుతోంది.