AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్నింగ్ నిద్రలేవగానే మీరు చేసే ఈ ఒక్క పని.. మీ జీవితాన్నే తలకిందులు చేయొచ్చు! జాగ్రత్త!

ప్రస్తుతం మొబైల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి రాత్రి పడుకునే వరకు దాంతోనే గడపడం ఈ రోజుల్లో చాలామందికి ఒక వ్యసనంగా మారిపోయింది. కానీ ఈ అలావాటు మన జీవితాన్ని ఎలా మార్చేస్తుందని చాలా మందికి తెలియదు. ఈ ఒక్క అలావాటు కారణంగా మన ఆరోగ్యా ఎలా ప్రభావితం అవుతుందో ఇక్కడ వివంగా తెలుసుకుందాం.

మార్నింగ్ నిద్రలేవగానే మీరు చేసే ఈ ఒక్క పని.. మీ జీవితాన్నే తలకిందులు చేయొచ్చు! జాగ్రత్త!
Morning Phone Addiction
Anand T
|

Updated on: Aug 10, 2026 | 1:17 PM

Share

ప్రస్తుత రోజుల్లో ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. అసరం లేకపోయినా జనాలు గంటలు గంటలు ఫోన్‌తోనే గడిపేస్తున్నారు. నిద్రలేవగానే వాట్సాప్ మెసేజ్‌లు, ఇన్స్టాగ్రామ్ స్టోరీలు, వాతావరణం లేదా వార్తలు చూడటంతోనే రోజూను స్టార్ట్ చేస్తున్నారు. ఇదే చిన్న అలవాటే కొద్ది రోజులకు వ్యసనంగా మారుతుంది. ఈ క్రమంలో రాత్రి మనం పడుకున్నప్పుడు కూడా ఎవరైనా మెసేజ్ చేశారా, ముఖ్యమైన ఈమెయిల్ వచ్చిందా లేదా ఏదైనా కొత్త వార్త ఉందా అనే అనిశ్చితి నుంచి బయటపడటానికి మెదడు వెంటనే ఫోన్ చూడమని మనల్ని ప్రేరేపిస్తుంది.

వ్యవసనాన్ని తగ్గించుకోవడం ఎలా 

దీనికి ప్రధాన కారణం మనకు ఫోన్‌తో ఎలాంటి అవసరం లేకపోయినా కూడా దాన్ని చూడడానికి టైం కేటాయించడం. ఒకానొక స్టేజ్‌కు వచ్చే సరికి.. పరిస్థితి ఎలా మారిపోతుందంటే.. మీ పోన్‌తో మీకు ఎలాంటి అవసరం లేకపోయినా.. ఏదో ఉంది.. ఇప్పుడు నువ్వు ఫోన్ చూడు అనేలా మీ బ్రెయిన్ మిమ్మల్ని మార్చేస్తుంది. దీని నుంచి మీరు బయటపడాలి అంటే.. మీరు ఫోన్‌ను ఎలా వాడుతున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. రోజు మొత్తంలో దాన్ని ఎన్ని గంటలు వాడుతున్నారు. ఎన్ని గంటలకు దానికి బ్రేక్ ఇస్తున్నారు. అనే విషయాలు తెలుసుకుంటే.. ఈ అలవాటు నుంచి మీరు తప్పించుకోవచ్చు.

ఉదయపు సమయాన్ని ఎలా కాపాడుకోవాలి?

మీరు మార్నింగ్ ఫోన్ స్క్రీన్ చూడటం వల్ల టైం వేస్ట్ అవ్వడమే కాకుండా, శారీరకంగా, మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ఉదయం లేవగానే మొబైల్ పక్కన పెట్టి ప్రశాంతమైన వాతావరణాన్ని అలవాటు చేసుకోండి. పొద్దున్నే లేచిన వెంటనే రోజువారీ పనులు, వ్యాయామం లేదా ధ్యానం వంటి మంచి అలవాట్లకు టైం ఇవ్వండి. ప్రతిరోజూ మీరు ఫోన్ కోసం ఎంత సమయం వృథా చేస్తున్నారో గమనిస్తే, ఈ అలవాటును మానడం సులువవుతుంది.

జీవితాన్ని మార్చుకోండిలా

మనం డే మొత్తం ఎంత యాక్టీవ్‌గా ఉంటామనేది.. మార్నింగ్ మనం చేసే పనులపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ విలువైన సమయాన్ని స్క్రీన్లకు బలి ఇవ్వకుండా, ఆరోగ్యాన్ని, సమయాన్ని కాపాడుకోవాడినికి కేటాయించండి.ఈ చిన్న అలవాటు మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకురావచ్చు. ఇకపై మార్నింగ్ లేవగానే ఫోన్‌ను పట్టుకోకుండా.. పైన చెప్పిన పనులు చేసేందుకు ప్రయత్నించండి.

మరిన్ని లైఫ్‌స్లైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Follow Us