ఇరాన్‌తో అణు ఒప్పందంపై ట్రంప్ సంచలన నిర్ణయం.. హర్మూజ్ రీఓపెన్‌కు లైన్ క్లియర్ అయినట్టేనా!
పశ్చిమాసియాలో కీలక పరిణామం చోటుచేసుకోబోతుంది. ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. టెహ్రాన్ హర్మూజ్ జలసంధిని పూర్తిగా ఓపెన్ చేస్తే.. ఇరాన్‌తో జరగబోయే అణు ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే పశ్చిమాసియాలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది. కానీ దీనిపై అమెరికా మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇరాన్‌తో అణు ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ది వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక కథనం ప్రకారం.. ప్రపంచ సముద్ర రవాణాకు కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిని పూర్తిగా ఓపెన్ చేసి.. వాణిజ్య నౌకల రాకపోకలను ఇరాన్ పునఃప్రారంభిస్తే.. కొత్తగా అణు ఒప్పందాన్ని కుదుర్చుకునే ప్రయత్నాలను విరమించుకునేందుకు.. ఆ ప్రాంతంలో సైనిక చర్యలను ముగించేందుకు డోనాల్డ్ ట్రంప్ సిద్ధంగా ఉన్నట్టు పేర్కొంది.
ఇది జరిగితే.. హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు, సరుకు రవాణా నౌకల రాకపోకలను తిరిగి ప్రారంభం అవ్వడంతో పాటు.. ప్రస్తుతం అమలులో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని వారాలుగా ఇదే అంశంపై డోనాల్డ్ ట్రంప్ కసరత్తు చేస్తున్నారని, ఇరాన్‌తో కొత్త అణు ఒప్పందం కుదరకపోయినా తాను ఈ వ్యవహారం నుంచి బయటపడగలనని ట్రంప్ సీనియర్ సహాయకులతో తెలిపినట్లు అమెరికా అధికారులను ఉటంకిస్తూ ఈ నివేదిక తన కథనంలో రాసుకొచ్చింది.
ఇరాన్ కఠినమైన ఆంక్షలు
ఇదిలా ఉండగా హోర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయడానికి ఇరాన్ వాషింగ్టన్ ముందు భారీ షరతుల జాబితాను ఉంచింది. వాటిలో ముఖ్యంగా ఈ యుద్ధం కారణంగా నష్టపోయిన దానికి పరహారంగా బిలియన్ల కొద్దీ డాలర్ల చెల్లింపులు, అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనం రద్దు, పశ్చిమాసియా ప్రాంతం నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ, ఇరాన్‌పై ఉన్న ఆర్థిక ఆంక్షల ఎత్తివేత, సీజ్ చేసిన తమ ఆస్తుల విడుదల చేయాలని ఇరాన్ కండిషన్స్ పెట్టింది. ఈ కఠినమైన షరతుల కారణంగానే వాషింగ్టన్‌కు దౌత్యపరమైన మార్గాలను తగ్గించుకుంది. దీన్ని బట్టి చూస్తే ఇరాన్ సత్వర పరిష్కారం కంటే సుదీర్ఘమైన ప్రతిష్టంభనకే సిద్ధపడుతోంద తెలుస్తోంది.
ప్రపంచ వ్యాపారానికి కీలకమైన జలసంధి
ఓమన్, ఇరాన్‌ల మధ్య ఉన్న ఈ హర్మూజ్ జలసందే ఇప్పుడు టెహ్రాన్‌కు ప్లెస్ పాయింట్ అయింది. ఈ జలసంధిని తన గుప్పిట్లో పెట్టుకొని అటుగా ప్రయాణించే వాణిజ్య నౌకలను అడ్డుకుంటూ.. ఇరాన్ అంతర్జాతీయ మార్కెట్లలో చమురు సరఫరాను ప్రభావితం చేస్తోంది. గత ఫిబ్రవరిలో యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఈ మార్గాన్ని క్లోజ్ చేసిన ఇరాన్.. ఆ మార్గం గుండా అమెరికా, దాని మిత్రదేశాల నౌకలను అనుమతించమని స్పష్టం చేసింది. అంతేకాదు..ఆ మార్గం గుండా వెళ్లే వాణ్య నౌకల నుంచి టోల్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేసింది. దీన్ని ఆమెరికా తీవ్రంగా ఖండించింది.
ట్రంప్‌పై పెరుగుతున్న ఎన్నికల ఒత్తిడి
అయితే ఈ హర్మూజ్ జలసంధి అనేది ఇప్పుడు ట్రంప్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. హోర్ముజ్ జలసంధిని ఇప్పటికే ఓపెన్ చేసినట్టు ట్రంప్ పదే పదే చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది.. యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి అమెరికాలో ఇంధన ధరలు పెరుగుతూ వచ్చాయి. దీంతో జనాల్లో ఆగ్రహం కూడా పెరుగూ వచ్చింది. ముఖ్యంగా అమెరికాలో మరో మూడు నెలల్లో మిడ్‌టర్మ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. హర్మూజ్‌ను ఓపెన్ చేసి అమెరికా అనుకున్న లక్ష్యాలను సాధించిందని ట్రంప్ నిరూపించాల్సి ఉంది. అందుకే ట్రంప్ ఈ నిర్ణయానికి వచ్చారని నివేదికలు చెబుతున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
