AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విరిగిన పుర్రె ఎముక .. ఫ్లైదుబాయ్ హీరోకు ఎమర్జెన్సీ ఆపరేషన్

ఫ్లైదుబాయ్ విమానంలో కో పైలట్‌ దాడిని ఎదుర్కొని ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తలకు తీవ్ర గాయమై, పుర్రెకు ‘డిప్రెస్డ్ ఫ్రాక్చర్ కావడంతో సౌదీ అరేబియాలోని తబుక్‌ లో అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించి, దెబ్బతిన్న పుర్రె భాగాన్ని వైద్యులు పునర్నిర్మించారు. తర్వాత స్మిత్ మచ్చర్‌ను సౌదీ అరేబియా నుంచి యూఏఈకి ఎయిర్‌లిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన అబుదాబిలో చికిత్స పొందుతున్నారు.

విరిగిన పుర్రె ఎముక  .. ఫ్లైదుబాయ్ హీరోకు ఎమర్జెన్సీ ఆపరేషన్
Flydubai Hero Pilot Skull Fractured In Attack Undergoes Surgery In Saudi
Sharada V
|

Updated on: Oct 07, 2026 | 8:11 AM

Share

దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో సెప్టెంబర్ 30న ఈ ఘటన జరిగింది. విమానం గాల్లో ఉండగానే కో-పైలట్ హమ్మామ్ అల్-హమ్మామీ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై పికాక్స్ గొడ్డలితో వెనుక నుంచి నాలుగైదు సార్లు కొట్టాడు. దాడిలొ మచ్చర్‌కు జరిగింది సాధారణ ఫ్రాక్చర్ కాదు. పుర్రె ఎముకలో కొంత భాగం లోపలికి ఒత్తుకుపోయింది. ఆ పరిస్థితిని ‘డిప్రెస్డ్ స్కల్ ఫ్రాక్చర్’ అంటారని వైద్యులు తెలిపారు. మెదడుపై ఒత్తిడి పెంచే ప్రమాదం ఉండటంతో తబుక్‌లో విమానం ల్యాండ్ అయిన తర్వాత మచ్చర్‌కు వెంటనే శస్త్రచికిత్స చేసారు.

ప్రాణాల కోసం పోరాడుతూనే ప్రయాణికుల గురించి ఆలోచన

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన వీడియో కాల్‌లో మచ్చర్ స్వయంగా వివరాలు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన తర్వాత కాక్‌పిట్ నేలపై పడిపోయారు. విమానం వేగంగా కిందకు దిగుతుండటం గుర్తించి, కాక్‌పిట్ తలుపు తెరవకపోతే ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదమని భావించి తన శక్తినంతా కూడదీసుకుని చివరకు తలుపు తెరిచాననీ చెప్పారు. తర్వాత ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి ప్రవేశించి దాడి చేసిన కోపైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు.

తీవ్ర గాయాల మధ్య విమాన ప్రమాదాన్ని తప్పించిన హీరో

విమానంలో 170 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం ఒక్కసారిగా వేల అడుగుల ఎత్తు కోల్పోయినప్పటికీ, మచ్చర్ తీసుకున్న కీలక నిర్ణయం పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి సహాయపడింది. అనంతరం ఇద్దరు స్టాండ్ బై పైలట్లు విమానాన్ని ల్యాండ్ చేసారు.  ఈ ఘటన తర్వాత మచ్చర్ ధైర్యాన్ని ప్రధాని మోదీతో పాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రశంసించారు.  దేశం గర్వించదగ్గ హీరోగా మోదీ అభివర్ణించారు. సౌదీలో అత్యవసర శస్త్రచికిత్స అనంతరం మచ్చర్‌ను యూఏఈకి తరలించారు. ప్రస్తుతం అబుదాబిలో వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది.

Follow Us
విరిగిన పుర్రె ఎముక .. ఫ్లైదుబాయ్ హీరోకు ఎమర్జెన్సీ ఆపరేషన్
విరిగిన పుర్రె ఎముక .. ఫ్లైదుబాయ్ హీరోకు ఎమర్జెన్సీ ఆపరేషన్
భారతదేశ రూపురేఖలు మార్చిన.. ప్రధాని మోదీ 25 విప్లవాత్మక ఆలోచనలు
భారతదేశ రూపురేఖలు మార్చిన.. ప్రధాని మోదీ 25 విప్లవాత్మక ఆలోచనలు
వలపు వల.. నేవీ ఉద్యోగులను మాయ చేసిన పాక్ మహిళా ఏజెంట్లు వీరేనట!
వలపు వల.. నేవీ ఉద్యోగులను మాయ చేసిన పాక్ మహిళా ఏజెంట్లు వీరేనట!
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. ముహూర్తం ఖారారు.. అప్పటినుంచే..
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. ముహూర్తం ఖారారు.. అప్పటినుంచే..
32 ఫోర్లు, 17 సిక్సర్లు.. ఎకానా గడ్డ.. సర్పంచ్ సాబ్ అడ్డా
32 ఫోర్లు, 17 సిక్సర్లు.. ఎకానా గడ్డ.. సర్పంచ్ సాబ్ అడ్డా
రోజూ నీరసంగా ఉంటున్నారా? ఈ సహజ ఆహారాలు మీ డైట్‌లో చేర్చుకోండి
రోజూ నీరసంగా ఉంటున్నారా? ఈ సహజ ఆహారాలు మీ డైట్‌లో చేర్చుకోండి
'జీవిత భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా? అన్నాడు'
'జీవిత భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా? అన్నాడు'
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్