AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US F1 వీసా స్లాట్‌ కోసం రూ.20 వేలు డిమాండ్.. ఇవ్వలేదని ఇంటర్వ్యూ రద్దు.. భారతీయ విద్యార్థి సంచలన ఆరోపణలు

అమెరికాలో చదువుకోవాలని కలలు కంటున్న భారతీయ విద్యార్థులకు F-1 వీసా ఇంటర్వ్యూ స్లాట్లు దొరకడం పెద్ద సవాలుగా మారుతోంది. ఓ భారతీయ విద్యార్థి చేసిన ఆరోపణలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. వీసా ఇంటర్వ్యూ స్లాట్‌ ఇప్పిస్తానంటూ ఓ ఏజెంట్ అదనంగా రూ.20,000 డిమాండ్ చేశారని.. తాను ఆ డబ్బు చెల్లించేందుకు నిరాకరించడంతో ఏజెంట్ తన ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ను రద్దు చేశారని విద్యార్థి ఆరోపించాడు.

US F1 వీసా స్లాట్‌ కోసం రూ.20 వేలు డిమాండ్.. ఇవ్వలేదని ఇంటర్వ్యూ రద్దు.. భారతీయ విద్యార్థి సంచలన ఆరోపణలు
Indian Student Claims October Interview Date Got Canceled For Refusing To Pay Agent Extra
Sharada V
|

Updated on: Oct 06, 2026 | 8:10 PM

Share

ఈ విషయాన్ని విద్యార్థి Redditలో వెల్లడించాడు. ప్రస్తుతం అధికారిక US వీసా షెడ్యూలింగ్ వెబ్‌సైట్‌లో తన అప్లికేషన్ స్టేటస్‌ ‘Open’గా కనిపిస్తున్నప్పటికీ, కొత్త అపాయింట్‌మెంట్ స్లాట్లు అందుబాటులో లేవని తెలిపాడు. అమెరికాలోని ఓ యూనివర్సిటీలో చదువుకోవాలని భావిస్తున్న విద్యార్థికి తొలుత ఆగస్టు 31, 2026 కోర్సు ప్రారంభ తేదీతో I-20 వచ్చింది. అయితే ఆ తేదీకి ముందుగా వీసా ఇంటర్వ్యూ స్లాట్‌ దొరకలేదు.

దీంతో తన చదువును జనవరి 2027 intakeకు వాయిదా వేయాల్సి రావచ్చని ఏజెంట్ చెప్పినట్లు విద్యార్థి తెలిపాడు. తర్వాత అక్టోబర్ 19న వీసా ఇంటర్వ్యూ స్లాట్‌ సంపాదించినట్లు ఏజెంట్ సమాచారం ఇచ్చాడట. అయితే ఆ స్లాట్‌ కోసం అదనంగా రూ.20,000 చెల్లించాలని కోరినట్లు విద్యార్థి తెలిపాడు. అదనపు డబ్బు ఎందుకు చెల్లించాలో స్పష్టంగా తెలియకపోవడంతో తాను నిరాకరించానని చెప్పాడు. డబ్బు చెల్లించకపోతే అపాయింట్‌మెంట్‌ను రద్దు చేస్తానని ఏజెంట్ చెప్పాడని.. చివరకు నిజంగానే స్లాట్‌ రద్దయిందని ఆరోపించాడు. అపాయింట్‌మెంట్ రద్దయినట్లు తనకు కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వచ్చిందని తెలిపాడు.

అధికారిక వీసా ఫీజు ఎంత?

అమెరికా విదేశాంగ శాఖ ప్రకారం F, M, J వంటి నాన్‌-ఇమిగ్రెంట్ వీసాలకు సాధారణ వీసా అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 185 డాలర్లు. F-1 విద్యార్థి వీసా కూడా ఈ కేటగిరీలోనే ఉంటుంది. అదే సమయంలో F-1 విద్యార్థులు సాధారణంగా I-901 SEVIS ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇది వీసా అప్లికేషన్ ఫీజుకు వేరుగా ఉంటుంది. అయితే రూ.20,000ను F-1 వీసా ఇంటర్వ్యూ కోసం అధికారిక ‘అపాయింట్‌మెంట్ ఫీజు’గా అమెరికా ప్రభుత్వం పేర్కొనలేదు. కాబట్టి ఏజెంట్ కోరిన అదనపు మొత్తాన్ని ప్రభుత్వ రుసుముగా భావించకూడదు.

ఏజెంట్ల విషయంలో జాగ్రత్త

అమెరికా విదేశాంగ శాఖ కూడా వీసా ప్రక్రియలో థర్డ్‌-పార్టీ సేవల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. కొన్ని ప్రైవేట్ వెబ్‌సైట్లు, సేవా సంస్థలు ప్రభుత్వంతో సంబంధం ఉన్నట్లుగా కనిపించినప్పటికీ అవి ప్రభుత్వ సంస్థలు కాకపోవచ్చని అధికారిక వెబ్‌సైట్‌ చెబుతోంది. వీసా దరఖాస్తు ఫారమ్‌లు అధికారిక అమెరికా ప్రభుత్వ వెబ్‌సైట్లలో ఉచితంగా లభిస్తాయని కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థి ప్రస్తుతం ఏజెంట్‌తోనే కొనసాగాలా? వీసా ప్రక్రియను తానే నిర్వహించుకోవాలా? అనే సందిగ్ధంలో ఉన్నట్లు తెలిపాడు.

అమెరికా విదేశాంగ శాఖ మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులు వీసా ప్రక్రియకు సంబంధించిన అధికారిక సమాచారం, ఫీజులు, ఇంటర్వ్యూ వివరాలను ప్రభుత్వ వెబ్‌సైట్లలోనే పరిశీలించవచ్చు. ఇంటర్వ్యూ వెయిట్ టైమ్‌ కూడా ప్రాంతం, సీజన్‌, వీసా కేటగిరీ ఆధారంగా మారుతుంది.ముంబైలోని అమెరికా కాన్సులేట్ మార్గదర్శకాల ప్రకారం అపాయింట్‌మెంట్‌ను రద్దు చేస్తే తదుపరి స్లాట్‌ కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సి రావచ్చు. అందుకే ఇప్పటికే కేటాయించిన తేదీకి హాజరు కావాలని సూచించింది. F-1 వీసా కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు ఏజెంట్‌ చెప్పిన ప్రతి రుసుమును అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉన్న ఫీజులతో సరిపోల్చుకోవడం మంచిది. ముఖ్యంగా ‘ఎర్లీ స్లాట్’, ‘స్పెషల్ అపాయింట్‌మెంట్’, ‘గవర్నమెంట్ కనెక్షన్’ పేరుతో అదనపు డబ్బు అడిగితే జాగ్రత్తగా ఉండాలి. ఈ ఘటన అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులు వీసా అపాయింట్‌మెంట్ విషయంలో అధికారిక మార్గాలను మాత్రమే ఉపయోగించాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తోంది.

Follow Us
US F1 వీసా స్లాట్‌ కోసం రూ.20 వేలు డిమాండ్.. ఇంటర్వ్యూ రద్దు
US F1 వీసా స్లాట్‌ కోసం రూ.20 వేలు డిమాండ్.. ఇంటర్వ్యూ రద్దు
వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోన్న 'అగ్గిపెట్టె మచ్చ'..ఏమైందంటే?
వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోన్న 'అగ్గిపెట్టె మచ్చ'..ఏమైందంటే?
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీబీఐ సోదాలు..!
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీబీఐ సోదాలు..!
గురు నక్షత్ర గోచారంతో వీరికి కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు
గురు నక్షత్ర గోచారంతో వీరికి కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు
టెర్మినేటర్ సీన్ రిపీట్! వేడి లావాలోకి దూకేసిన హ్యూమనాయిడ్ రోబోలు
టెర్మినేటర్ సీన్ రిపీట్! వేడి లావాలోకి దూకేసిన హ్యూమనాయిడ్ రోబోలు
ఆకాశవాణి భవన్‌ వద్ద హైటెన్షన్.. రాహుల్‌గాంధీ సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్..!
ఆకాశవాణి భవన్‌ వద్ద హైటెన్షన్.. రాహుల్‌గాంధీ సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్..!
బంగారం ధర 26% పతనం.. ఇదే కొనడానికి సరైన సమయమా? వేచి ఉండాలా?
బంగారం ధర 26% పతనం.. ఇదే కొనడానికి సరైన సమయమా? వేచి ఉండాలా?
అంతర్జాతీయ వేధింపుల గ్యాంగ్‌ వెనుక భారతీయుడు!
అంతర్జాతీయ వేధింపుల గ్యాంగ్‌ వెనుక భారతీయుడు!
‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా ట్రైలర్
‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా ట్రైలర్
హాయిగా నిద్రపోండి-లక్షల్లో గెలుచుకోండి! వినూత్న స్లీప్ కాంపిటీషన్
హాయిగా నిద్రపోండి-లక్షల్లో గెలుచుకోండి! వినూత్న స్లీప్ కాంపిటీషన్