ఏపీ గృహ నిర్మాణంలో సరికొత్త విప్లవం.. రూ.2.50 లక్షలకే 90 ఏళ్లు నిలిచే ఇల్లు!
ఆంధ్రప్రదేశ్‌లో 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో గృహ నిర్మాణ రంగంలో విప్లవం ఆరంభమైంది. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. రూ.2.50 లక్షలకే 90 ఏళ్లు మన్నికైన, ప్రకృతి విపత్తులను తట్టుకునే ఇళ్లను 10 రోజుల్లో నిర్మించడమే లక్ష్యం. ఈ ఇళ్లు ఏసీ లేకుండానే చల్లదనాన్ని అందిస్తాయి.
ఆంధ్రప్రదేశ్‌లో 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో గృహ నిర్మాణ రంగంలో సరికొత్త విప్లవం ఆరంభమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో ఈ విప్లవాత్మక పథకానికి భూమి పూజ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కింద రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ఈ విధానంలో చేపట్టనున్నారు. ఈ 3D ప్రింటింగ్ ఇళ్లు ఇనుము లేకుండానే 80-90 ఏళ్ల పాటు మన్నికగా ఉంటాయని, కేవలం 10 రోజుల్లోనే నిర్మాణం పూర్తవుతుందని తెలుస్తోంది. ప్రత్యేక కాంక్రీట్ మిశ్రమంతో రోబోటిక్ పరిజ్ఞానం ఆధారంగా పొరలు పొరలుగా గోడలను నిర్మిస్తారు. ఈ ఇళ్లు భూకంపాలు, వరదలను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. గోడల మధ్య మట్టి నింపడం వల్ల ఏసీ లేకుండానే ఎనిమిది డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. సాధారణ నిర్మాణాల కంటే 20-30 శాతం ఖర్చు తగ్గి, ఒక్కో ఇంటి సూపర్ స్ట్రక్చర్ కు సుమారు రూ.2.50 లక్షలు మాత్రమే ఖర్చవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టు దేశ గృహ నిర్మాణ రంగంలోనే ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.
మరిన్ని వీడియోల కోసం :
ఒకే నెలలో రెండు సినిమాలతో సందడి చేస్తున్న సాయి పల్లవి
కన్‌ఫ్యూజన్‌లో కన్నడ హీరోలు..ఎందుకంటే?
బాలీవుడ్‌లో సినిమా తీయటం అంత ఈజీ కాదన్న అజయ్ దేవగన్
ఆకతాయిలకు జూనియర్ వార్నింగ్… ఎవ్వరినీ వదిలిపెట్టనన్న ఎన్టీఆర్..
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

