AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI Repo Rate: బిగ్ బ్రేకింగ్.. కొత్త వడ్డీ రేట్లు ప్రకటించిన ఆర్బీఐ..

రెపో రేటుపై ఆర్బీఐ ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు బుధవారం ఉదయం ఆర్బీఐ నుంచి అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఎల్‌నివో ప్రభావం, ద్రవ్యోల్బణం పెరుగుతుండటం దేశ ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో మూడు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో వీటిపై చర్చించారు.

RBI Repo Rate: బిగ్ బ్రేకింగ్.. కొత్త వడ్డీ రేట్లు ప్రకటించిన ఆర్బీఐ..
Rbi Repo Rate
Venkatrao Lella
|

Updated on: Oct 07, 2026 | 10:18 AM

Share

వడ్డీ రేట్లపై ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్ చేసింది. వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నట్లు ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం రెపో రేటు 5.25 శాతంగా ఉండగా.. ఇప్పుడు 5.50 శాతానికి చేర్చింది. అక్టోబర్ 5వ తేదీ నుంచి 7వ తేదీన ఆర్బీఐ ద్రవ్య విధాన పరపతి సమావేశాలు నిర్వహించారు. ఈ మీటింగ్‌లో రెపో రేట్లపై చర్చించిన అనంతరం ఈ ప్రకటన జారీ చేశారు. వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచనుందని గత కొద్ది కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. పలు ఏజెన్సీలు, బిజినెస్ అనలిస్టులు కూడా రెపో రేటు పెంచే అవకాశముందని అంచనాలు వేశారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, ఆర్ధిక వ్యవస్థపై ఎల్‌నివో ప్రభావం క్రమంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను ఎలా ఉంచుతుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దీంతో ఆర్బీఐ ప్రకటన కోసం ఎదురుచూశారు. ఇప్పుడు ఎట్టకేలకు ఆర్బీఐ నుంచి ప్రకటన వచ్చింది.

ఊహించినదే జరిగింది..

ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచనుందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అందరూ అనుకున్నదే జరిగింది. వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆర్బీఐ ప్రకటనతో స్ాక్ మార్కెట్లు కుప్పకూలాయి. 400 పాయింట్లకు పైగా నష్టంతో సెన్సెక్స్ కొనసాగుతుండగా.. నిఫ్టీ 170 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది. రూపాయి మారకపు విలువ 10 పైసలు క్షీణించింది. రెపో రేరటు పెంపుతో ఈఎంఐలు కడుతున్నవారిపై భారం పడనుంది. ఫ్లోటింగ్ వడ్డీ రేటు ప్రకారం లోన్లు తీసుకున్నవారికి ఈఎంఐలు పెరగనున్నాయి. అలాగే కొత్తగా లోన్లు తీసుకోవాలన్నా అధిక వడ్డీ రేట్లు పడతాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసినవారికి, కొత్త ఎఫ్‌డీ చేసేవారికి మాత్రం దీని వల్ల లాభం జరగనుంది. వడ్డీ రేట్లు పెరగడం వల్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల వల్ల అధిక ఆదాయం లభిస్తుంది. కొంతమందికి నష్టం జరగనుండగా.. మరికొంతమందికి రెపో రేటు పెంపు వల్ల లాభం జరగనుందని చెప్పవచ్చు.

మరింత పెరుగుతాయా..?

అయితే ఆర్బీఐ రెపో రేటును రానున్న రోజుల్లో మరింత పెంచే అవకాశముందని తెలుస్తోంది. విడతల వారీగా వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచనుందని సమాచారం. వచ్చే సమావేశంలో మరో 25 బేసిస్ పాయింట్లు పెంచే ఛాన్స్ ఉండగా.. విడతల వారీగా 125 బేసిస్ పాయింట్ల మేర పెంచనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2023లో ఆర్బీ వడ్డీ రేట్లను పెంచగా.. 2025లో తగ్గించింది. మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచింది.

Follow Us